Pawan Kalyan: బెంగళూరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
AP: బెంగళూరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. కర్ణాటక అటవీశాఖ మంత్రితో సమావేశం కానున్నారు. కుంకీ ఏనుగులు, ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించనున్నారు.
AP: బెంగళూరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. కర్ణాటక అటవీశాఖ మంత్రితో సమావేశం కానున్నారు. కుంకీ ఏనుగులు, ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించనున్నారు.
విశాఖపట్నం జిల్లాలోని పలువురు వైసీపీ నేతలు, కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీపై తనకు ఎలాంటి కక్ష లేదని, తనకు ఎవరూ శత్రువు కాదన్నారు. అందరూ కలిసిగట్టుగా రాష్ట్ర, పార్టీ అభివృద్ధికోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఐదు మంది వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారికి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు.
పాలన చేతకాని వాడికి ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు ఎమ్మెల్యే కూన రవికుమార్. అసెంబ్లీకి రాని జగన్కు రాష్ట్రంలో ఏం పని అని నిలదీశారు. గత ఐదేళ్లలో జగన్ చేసిన అవినీతి అంతు చిక్కడం లేదని .. నెల రోజుల్లో జగన్ అవినీతి బట్టబయలు చేసి పని పడతామన్నారు.
ఏపీ మాజీ సీఎం జగన్ బంధువులే తనకు తెలియదంటూ సీబీఐ కోర్టుకు అబద్దాలు చెప్పిన దుర్మార్గుడని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబును ఆయన కలిశారు. ఏపీ , తెలంగాణలో రావణాసురుడు, శిశుపాలుడి పాలన పోయిందన్నారు.
విజయనగరం జిల్లా బొబ్బిలి వీణపై RTV స్పెషల్ స్టోరీ అందిస్తుంది. ఒకే కర్రతో వీణను తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత. ఈ వీణ తయారు చేయాలంటే సంగీతంలో సరిగమ పదనిసలపై ప్రావీణ్యం ఉండాలని అంటున్నారు బొబ్బిలి కళాకారులు. పూర్తి సమాచారం కోసం పై వీడియో చూడండి..
AP: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. జిల్లాలోని వైసీపీకి 644 మందికి పైగా సభ్యుల సంఖ్యా బలం ఉందని.. ఈ ఎన్నికలో విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు.
నంద్యాల రూరల్ సీఐ శివకుమార్ రెడ్డి, మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ సస్పెండ్ అయ్యారు. నంద్యాల జిల్లా సీతారామపురం వైసీపీ కార్యకర్త సుబ్బరాయుడి హత్య కేసుపై పోలీసులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వహించడంతో హోంశాఖ సీరియస్ అయింది.
AP: ప్రభుత్వ టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఇకపై ఉదయాన్నే మరుగుదొడ్లు ఫోటోలు తీసి అప్లోడ్ చేసే పని ఉపాధ్యాయులకు లేదని చెప్పింది. ఈ విధానాన్ని ఆపేసినట్లు ప్రకటించింది. ఈ ఆప్షన్ యాప్ నుంచి కూడా తొలిగించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు.