ఆంధ్రప్రదేశ్ AP: ఆసుపత్రిలో కూలిన పైకప్పు.. రెప్పపాటులో తప్పిన ప్రమాదం..! కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో పైకప్పు కూలింది. దీంతో రోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పాత భవనం కావడంతో వర్షపు నీరు నిల్వ ఉండడం వల్ల పైకప్పు పెచ్చు ఊడిపడిందన్నారు ఆసుపత్రి సూపరిండెంట్ స్వప్న. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి.! ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలానికి చెందిన సరిపల్లి అభినవ్ కుమార్ (17) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాజమండ్రి నుండి వస్తూ మార్గమధ్యలో అభినవ్ చలనం లేకుండా ఉన్నాడని ఓ వ్యక్తి జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: రాజధానికి రూ. 15 వేల కోట్లు.. అప్పుగా ఇస్తున్నారా? అభివృద్ధి కోసమే ఇస్తున్నారా?: రఘువీరారెడ్డి 11వ బడ్జెట్ లోనూ కేంద్రం ఏపీకి తీరని అన్యాయం చేసిందన్నారు సీడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి. అమరావతి రాజధాని కోసం రూ. 15 వేల కోట్లు ఏపీకి ఇస్తున్నట్లు ప్రకటించారు.. అయితే ఆ బడ్జెట్ అప్పుగా ఇస్తున్నారా.. లేదా అభివృద్ధి కోసమే ఇస్తున్నారా అన్నది క్లారిటీ లేదన్నారు. By Jyoshna Sappogula 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: ఏపీ హైకోర్టులో జగన్ పిటిషన్ తనకు ప్రధాన ప్రతిపక్షనేత హోదా ఇచ్చేలా స్పీకర్ ను ఆదేశించాలంటూ ఏపీ మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని తాను స్పీకర్ కు లేఖ రాసినా పట్టించుకోలేదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. By Nikhil 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అసెంబ్లీ సాక్షిగా వారికి వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు..! మదనపల్లె ఆర్డీవో ఆఫీస్లో అగ్నిప్రమాదంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఫైల్స్ ను ఉద్దేశపూర్వకంగా తగులబెట్టారన్నారు సీఎం చంద్రబాబు. ఇన్నాళ్లు ఎన్ని తప్పులు చేసినా చెల్లుబడి అయిందని ఇకపై చెల్లదని హెచ్చరించారు. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తానంటే ఉపేక్షించేది లేదన్నారు. By Jyoshna Sappogula 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం..! నెల్లూరు జిల్లా బోగోలు (మం) బిట్రగుంట రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కృష్ణపట్నం పోర్ట్ నుండి గోండియా, వాడ్స వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బిట్రగుంట స్టేషన్ లో పట్టాలు క్రాస్ చేస్తుండగా రైలు బోగీలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. By Jyoshna Sappogula 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: 25 మంది కూలీలు అస్వస్థత.. ఎందుకంటే? నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 25 మంది వ్యవసాయ కూలీలు అస్వస్థతకు గురయ్యారు. మొక్కజొన్న పంటకు గుళికలు వేస్తున్న సమయంలో వారంతా వాంతులు చేసుకున్నారు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: వాటి జోలికి వెళ్లొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్! ఇసుక జోలికి వెళ్లొద్దని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ రోజు జరిగిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దని, రాజకీయ ప్రతీకారాలకు పొవొద్దని స్పష్టం చేసినట్లు సమాచారం. By Nikhil 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: చంద్రబాబు ఇలా చేయమని చెప్పారు.. ఆ భవనాలు 9 నెలల్లో అందుబాటులోకి వస్తాయి: స్పీకర్ అయ్యన్న శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బిఎసి సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం కొన్ని శ్వేత పత్రాలు ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు 9 నెలల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn