America: అగ్ర రాజ్యంలో మరో భారతీయ విద్యార్థి మృతి..రెండునెలల్లో ఐదో ఘటన!
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు. పర్డ్యూ యూనివర్శిటీలో డాక్టరల్ అభ్యర్థి సమీర్ కామత్(23) సోమవారం సాయంత్రం ప్రకృతి రిజర్వ్‌లో చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు. పర్డ్యూ యూనివర్శిటీలో డాక్టరల్ అభ్యర్థి సమీర్ కామత్(23) సోమవారం సాయంత్రం ప్రకృతి రిజర్వ్‌లో చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
మంచు తుఫాన్, భారీ వర్షాలతో అమెరికా అతలాకుతలమవుతోంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో ఎనిమిది కౌంటీల్లో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు. పర్వతప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని ప్రభుత్వం కోరింది. వేల సంఖ్యలో విమానాలు రద్దు చేశారు.
సంగీత రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల ప్రధానోత్సవంలో శంకర్ మహదేవన్, జాకిర్ హుస్సెన్‌లు జయకేతనం ఎగరవేశారు. వీళ్లు కంపోజ్ చేసిన 'దిస్ మూమెంట్' ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డును దక్కించుకుంది.
శుక్రవారం నాడు ఇరాక్, సిరియాలో అమెరికా భీకరమైన దాడులు నిర్వహించింది. ఇరాన్- మద్దతుగల గ్రూపులకు చెందిన 85 లక్ష్యాల పై అమెరికా సైన్యం సుమారు 85 లక్ష్యాలపై భారీ వైమానిక దాడులకు పాల్పడింది.ఇరాక్, సిరియాలో జరిగిన దాడిలో సుమారు 40 మంది మరణించారు.
ఇరాన్ రివల్యూషనరీ గార్డుల స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించడం పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ తీవ్రంగా తప్పు పట్టింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చర్యలు దాడులను మరింత ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపించింది.
అగ్రరాజ్యంలో మరో భారతీయ విద్యార్థిమృతి చెందాడు. ఒహియోలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెనిగేరి దురదృష్టవశాత్తూ మృతి చెందడం పట్ల భారత కాన్సులేట్ అధికారులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా అమెరికా సరిహద్దులు పటిష్టంగా ఉండేవి అని ట్రంప్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు సరిహద్దులు అంత సురక్షితంగా లేవని ట్రంప్ అన్నారు.అమెరికా, మెక్సికో సరిహద్దుకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందం వినాశనాన్ని కలిగిస్తుందని ట్రంప్ అన్నారు.
అమెరికాలో ఓ ఖైదీకి నైట్రోజన్ గ్యాస్ వాడి మరణ శిక్షను అమలు చేశారు. ఇలా మరణశిక్ష అమలు చేయడం ఇదే తొలిసారి. ఓ మత బోధకుడి భార్యను చంపిన కేసులో కెన్నెత్ స్మిత్ (58)కు ఫేస్ మాస్క్ అమర్చి స్వచ్ఛమైన నైట్రోజన్‌ను వదలడంతో దాన్ని పీల్చి మరణించినట్లు జైలు అధికారులు చెప్పారు.
నిక్కీహేలీ కి ట్రంప్ మద్దతుదారుడు ఒకర పెళ్లి ప్రపోజల్ తీసుకుని వచ్చాడు. దీనికి నిక్కీ కూడా సరదాగా నవ్వుతూ స్పందించారు. ఆమె పెళ్లి ప్రపోజల్ తీసుకుని వచ్చిన వ్యక్తిని '' నాకు ఓటు వేస్తావా? '' అని అడిగారు. దానికి అతను ట్రంప్ కే ఓటు వేస్తానని హేళనగా సమాధానం ఇచ్చాడు.