Trump: భారత్ తో సహా ఆ దేశాలన్నీ డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రాలు..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
భారత్ పై సంచలన ఆరోపణలు చేసారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇండియాతో సహా 23 దేశాలు డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నాయని..రవాణా స్థావరాలుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
భారత్ పై సంచలన ఆరోపణలు చేసారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇండియాతో సహా 23 దేశాలు డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నాయని..రవాణా స్థావరాలుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
అమెరికాలో టిక్ టాక్ మళ్ళీ వస్తోంది. దీనిపై చైనా, అమెరికాలో తొందరలోనే ఒక ఒప్పందానికి రానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై చైనా అధ్యక్షుడు జెన్ పింగ్ తో మాట్లాడతానని..యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు.
భారత్ పై సుంకాలు విధించడం అంత తేలికైన విషయం కాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. రష్యాపై చర్య తీసుకునేందుకు తమకింత కంటే మార్గం దొరకలేదని చెప్పారు. రష్యాపై చర్య తీసుకునేందుకు భారత్తో విభేదానికి తాము సిద్ధమయ్యామని చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై సొంత దేశంలోనే వ్యతిరేకత ఎక్కువ అవుతోంది. ఏ ప్రజలైతే అత్యధిక ఓట్లు వేసి ఎన్నుకున్నారో ఇప్పుడు 8 నెలల తర్వాత వారే ఆయన మాకు వద్దంటున్నారు.తాజాగా నిర్వహించిన సర్వేలో దాదాపు 57 శాతం మంది అమెరికన్లు ట్రంప్ పై వ్యతిరేకత ప్రకటించారు.
గడిచిన నాలుగు రోజుల్లో నాలుగు దేశాల ప్రధానులు గద్దెను కోల్పోయారు. దీనిపై ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రగ్రహణం అయిపోయింది..సూర్య గ్రహణానికి మాత్రం ఆయనే అంటూ ఎక్ లో పోస్ట్ పెట్టారు.
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మిత్రదేశాలతో ఆయన వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా చర్చనీయంశంగా మారుతోంది. మిత్రదేశంగా చెప్పుకుంటూనే మనదేశంపై భారీ సుంకాలు విధించిన ట్రంప్ మరో మిత్ర దేశం ఖతార్ విషయంలోనూ అదే గేమ్ షురూ చేశాడు.
అమెరికా అధ్యక్షుడు అక్టోబర్ లో దక్సిణ కొరియా పర్యటన చేస్తారని సమాచారం. ఈ పర్యటనలో చైనా అధినేత జిన్ పింగ్ ను కలిసి భేటీ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. చైనా, రష్యా, భారత్ లు కలిసిన నేపథ్యంలో ట్రంప్..జిన్ పింగ్ లభేటీ ఆసక్తికరంగా మారనుంది.
తనను గొప్ప ప్రధాని అన్నందుకు, మంచి స్నేహితిడిగా భావించినందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభినందిస్తున్నా అన్నారు భారత ప్రధాని మోదీ. ట్రంప్ భావాలను, ఇరు దేశాల సంబంధాలపై సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు.
భారత్ పై తాము భారీ సుంకాలను విధించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కానీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంతో నిరాశ చెందానని అన్నారు. చైనా చేతిలో భారత్, రష్యాలను ఓడిపోయానని అన్న గంటకు ట్రంప్ ఈ స్టేట్ మెంట్ ను ఇచ్చారు.