Nellore:నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రావెల్స్ బస్సును ఢీకొన్న లారీ.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి టోల్ ప్లాజా దగ్గర ఓ ప్రవైట్ బస్సును లారీ ఢీకొట్టింది. ఇందులో ఏడుగురు మృతి చెందగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి టోల్ ప్లాజా దగ్గర ఓ ప్రవైట్ బస్సును లారీ ఢీకొట్టింది. ఇందులో ఏడుగురు మృతి చెందగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మంగళవారం ఢిల్లీలోని ముఖర్జీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్యన్ అనే రెండున్నరేళ్ల చిన్నారిని కారు ఢీకొట్టింది. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
పంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. కారు ప్రమాదంలో నరాలు దెబ్బతిన్నట్లయితే కాలు తెగిపోయే అవకాశాలున్నాయి. ఆ సమయంలో నాకు చాలా భయమేసింది. అందరికీ రెండో జీవితం రాదు..కానీ నాకు వచ్చింది. అందుకు నేను చాలా అదృష్టవంతుడిని అనే చెప్పుకోవాలి
తమిళనాడు సింగిలిపట్టు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహార యాత్రకు వెళ్లి తిరిగివస్తున్న ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు వేగంగా సిమెంట్ లారీని ఢీ కొట్టింది. ఆరుగురు అక్కడిక్కడే దుర్మరణం చేందారు. ఈ ప్రమాదానికి కారు డ్రైవర్ నిద్రమత్తు కారణమని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ కూకట్పల్లిలో గ్రూడ్స్ ట్రక్ బీభత్సం సృష్టించింది. వసంత నగర్ రోడ్డుపై ఓ మూల మలుపులో అతివేగంగా వచ్చిన ఆటో అదుపుతప్పి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీ కొట్టింది. ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
పేరు తెచ్చిన స్టంట్సే చివరకు ప్రాణాలు తీశాయి. కాచిగూడకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ అర్ధరాత్రి బైక్ మీద స్టంట్స్ చేస్తుండగా అతి వేగంగా వచ్చి లారీ ఢీకొట్టడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. చాదర్ఘాట్ పీఎస్ పరిధిలోని సవేరా హోటల్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. హుస్నాబాద్-కరీంనగర్ ప్రధాన రహదారిపై అదుపు తప్పి కారు పల్టీలు కొట్టింది. యశ్వంత్ అనే యువకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలవగా హుస్నాబాద్ ఆస్పత్రికి తరలించారు.
పండగపూట ఏపీలో ఘోరం జరిగింది. ఏలూరు జిల్లా కానుకొల్లుకు చెందిన టీడీపీ నేత పంగిళ్ల నాగబాబు కూతుళ్లు వాకిట్లో ముగ్గులేస్తుండగా ఇటుకలారీ వారిపైకి దూసుకెళ్లింది. పెద్దమ్మాయి తేజస్విని అక్కడికక్కడే చనిపోగా.. చిన్నమ్మాయి పల్లవి దుర్గా చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
శనివారం ఉదయం శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గున్సిమియాగూడ వద్ద ఓ కారు.. ఆటో, బైక్ ను ఢీ కొట్టింది. మూడు వాహనాలు రోడ్డు విస్తరణ పనుల కోసం తవ్విన కల్వర్టు గుంతలో బోల్తా పడగా ఇద్దరు మరణించారు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది.