Aluminum: అల్యూమినియం ఫాయిల్‌లో టాబ్లెట్స్‌ ఎందుకు ప్యాక్‌ చేస్తారు..?

అల్యూమినియం దాని అసాధారణ లక్షణాల కారణంగా ఔషధ ప్యాకేజింగ్ కోసం ఉపయోగిస్తారు. ఇది UV కిరణాలు, నీటి ఆవిరి, నూనె, కొవ్వు, ఆక్సిజన్, సూక్ష్మజీవులు టాబ్లెట్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కవర్లలో ఆహారాన్ని ప్యాక్ చేస్తే ఎక్కువగా సేపు తాజాగా ఉంటుంది.

New Update
Aluminum: అల్యూమినియం ఫాయిల్‌లో టాబ్లెట్స్‌ ఎందుకు ప్యాక్‌ చేస్తారు..?

Aluminum: సాధారణంగా మీరు ఏదైనా టాబ్లెట్‌ కొనుగోలు చేసినప్పుడు అది అల్యూమినియం ఫాయిల్‌లో ప్యాక్ చేయబడి ఉంటుంది. అయితే ఇలా ఎందుకు ప్యాక్ చేశారో ఎప్పుడైనా గమనించారా?.. బ్లిస్టర్ ప్యాక్ అనేది ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో ఉపయోగించే ప్లాస్టిక్ ప్యాకేజింగ్. టాబ్లెట్‌లు ఒక్కొక్కటిగా ప్లాస్టిక్, అల్యూమినియం ఫాయిల్‌లో ప్యాక్ చేస్తారు. దీనిని బ్లిస్టర్ ఫిల్మ్ లేదా లిడ్ ఫిల్మ్ అంటారు. దీని కారణంగా క్యాప్సూల్స్ శుభ్రంగా ఉంటాయి. అంతేకాకుండా ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. అల్యూమినియం దాని అసాధారణ లక్షణాల కారణంగా ఔషధ ప్యాకేజింగ్ కోసం ఉపయోగిస్తారు. అల్యూమినియం తుప్పును దరిచేరనివ్వదు. అంతేకాకుండా తేమ, ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులను కూడా తట్టుకుంటుంది.

ఎక్కువ సేపు తాజాగా, వేడిగా ఉంటుంది:

  • ఇది UV కిరణాలు, నీటి ఆవిరి, నూనె, కొవ్వు, ఆక్సిజన్, సూక్ష్మజీవులు టాబ్లెట్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. అందుకే టాబ్లెట్స్‌ ప్యాకింగ్‌లో అల్యూమినియాన్ని ఉపయోగిస్తారు. కేవలం మందులే కాకుండా ఆహార నిల్వ కోసం అల్యూమినియం కవర్లు విస్తృతంగా వాడుతున్నారు. ఆఫీస్, పిల్లల స్కూళ్లకు తీసుకెళ్లే ఆహారాలను అల్యూమినియం ఫాయిల్‌లో భద్రపరుస్తున్నారు. అంతేకాకుండా రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కూడా వీటి వినియోగం అధికంగా ఉంటుంది. ఈ కవర్లలో ఆహారాన్ని ప్యాక్ చేస్తే తాజాగా, వేడిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

వంట పాత్రలు వాడేస్తారు:

  • అంతేకాదు మనిషి జీవితంలో అల్యూమినియం వాడకం పూర్వంనుంచే వస్తుంది. కొందరైతే.. ఇంట్లో దీనితో చేసిన వంట పాత్రలు వాడేస్తారు. ఇలా అల్యూమినియానికి ఉన్న అసాధారణ వలనే ప్యాకింగ్‌ మెటీరియల్‌గా మారింది. అయితే.. దీనికి తేమను, వేడిని తట్టుకునే శక్తి అధికంగా ఉంటుంది. ఔషధాలను ప్యాక్‌ చేయడానికి ఇంతకంటే మించిన మెటీరియల్‌ లేదని ప్యాకింగ్‌లకు ప్రాభించారు. అంతేకాదు.. వాటిని ఏమాత్రం కలుషితం కాకుండా రోగికి చేరేంత వరకు దాని సామర్థ్యం ఉంటుంది. దీని కారణంగానే పిల్స్‌, క్యాప్సుల్స్‌, ట్యాబ్లెట్ల ప్యాకింగ్‌కు అల్యూమినియం ఏళ్లుగా నిల్వ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా?

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ విషయం తెలిస్తే సోఫాలో అస్సలు పడుకోరు

Advertisment
Advertisment
తాజా కథనాలు