Swiggy: పెట్ లవర్స్ కు 'స్విగ్గీ' గుడ్ న్యూస్.. ఇలా చేస్తే చాలు..! స్విగ్గీ ఇప్పుడు పెట్ లవర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. 'స్విగ్గీ పాలీస్' పేరిట కొత్త సేవలను ప్రారంభించింది. తప్పిపోయిన పెట్స్‌ను వెతికి తెచ్చేందుకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త సేవలతో తప్పిపోయిన జంతువులను డెలివరీ పార్ట్ నర్స్ సాయంతో గుర్తించి వారికి అందిస్తారు. By Jyoshna Sappogula 13 Apr 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Swiggy: ఆన్ లైన్ ఫుడ్ యాప్ 'స్విగ్గీ' తన మెరుగైన సేవలతో నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఫుడ్ ఆర్డర్లు, నిత్యావసర సరుకులు డెలివరీ చేస్తూ సేవలు అందిస్తుంది. అయితే, తాజాగా స్విగ్గీ ఇప్పుడు మరో కొత్త సేవలను ప్రారంభించింది. పెట్ లవర్స్ కోసం 'స్విగ్గీ పాలీస్' పేరిట కొత్త సేవలను ప్రారంభించింది. జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం సందర్భంగా ఈ సేవలను ప్రారంభించింది స్విగ్గీ. Also Read: బాలీవుడ్ రామాయణంలో సాయి పల్లవి..ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. స్విగ్గీ పాలీస్ సేవల ద్వారా తప్పిపోయిన జంతువుల వివరాలతో స్విగ్గీ యాప్ లో ఫిర్యాదు చేయొచ్చు. కంప్లైంట్ అందిన వెంటనే స్విగ్గీకి చెందిన డెలివరీ పర్సన్స్ తప్పిపోయిన జంతువులను గుర్తించి వాటి వివరాలను, లొకేషన్ ను స్విగ్గీ టీమ్ కు సమాచారం అందిస్తారు. వారు వెంటనే పెట్స్‌ను వెతికిపెట్టి పెట్ పేరెంట్స్ కు చేరవేస్తారు. #swiggy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి