సుశాంత్‌ సూసైడ్ కేసు.. జైలు అనుభవాలు పంచుకున్న రియా!

సూశాంత్ సింగ్ సూసైడ్ కేసులో జైలుకు వెళ్లిన రియా చక్రవర్తి అక్కడి అనుభవాలను షేర్ చేసుకుంది. 'జైలులో రోటీ, క్యాప్సికం కూర పెట్టేవాళ్లు. పేరుకే అది కూర గానీ నీళ్లలా ఉండేది. అయినా బాగా ఆకలిగా ఉండటంతో తినేసేదాణ్ని. నేను పడుకునే పక్కనే టాయిలెట్‌ ఉండేది' అంటూ చెప్పుకొచ్చింది.

New Update
సుశాంత్‌ సూసైడ్ కేసు.. జైలు అనుభవాలు పంచుకున్న రియా!

Rhea Chakraborty: బాలీవుడ్ దివంగత నటుడు సూశాంత్ సింగ్ రాజ్ పుత్ (Shushanth) సూసైడ్ (sucide) కేసులో అరెస్ట్ అయిన ఆయన ప్రియురాలు, నటి రియా చక్రవర్తి తన జైలు (Jail) జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ మేరకు సుశాంత్‌సింగ్‌ మర్డర్ కేసు సినీ ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో సుశాంత్ ప్రియురాలుతోపాటు రియా చక్రవర్తిని అరెస్ట్‌ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో నెలరోజులపాటు జైలుశిక్ష అనుభవించి బయటికొచిన ఆమె.. రీసెంట్ గా ప్రముఖ రచయిత చేతన్‌ భగత్‌ టాక్‌ షోలో పాల్గొని తను ఎదుర్కొన్న అనుభవాలను బయటపెట్టింది.

పడుకునే పక్కనే టాయిలెట్‌..
ఈ మేరకు ‘జైలులో ఎక్కువగా రోటీ, క్యాప్సికం కూర పెట్టేవాళ్లు. పేరుకే అది కూర గానీ నీళ్లలా ఉండేది. అయినా బాగా ఆకలిగా ఉండటంతో తినేసేదాణ్ని. ఇక నేను పడుకునే పక్కనే టాయిలెట్‌ ఉండేది. ఇలాంటివి ఎన్నో పరిస్థితులు. కానీ.. ఆ సమయంలో పడిన శారీరక బాధలకన్నా.. అనుభవించిన మానసిక క్షోభే ఎక్కువగా ఉండేది. అయినా ఒక్కోసారి మిగతా ఖైదీలతో పోలిస్తే నా పరిస్థితి బాగానే ఉంది అనిపించేది' అని చెప్పింది.

ఇది కూడా చదవండి : Shivam Dube: మహీ భాయ్‌ చెప్పాడు.. నేను ఫాలో అవుతున్నా: సిక్సర్ల దూబె

నాగిన్‌ డ్యాన్స్.. 
అలాగే జైలు శిక్ష అనుభవిస్తు్న్న కొంతమందికి బెయిల్‌ దొరికినా రూ.5వేలు, రూ.10వేలు కట్టలేక బయటికి వెళ్లలేకపోయేవారని, అది తనకు ఎంతో బాధ కలిగించిందని చెప్పింది. ఇక తనకు బెయిల్‌ వచ్చినప్పుడు ‘మీరు హీరోయిన్‌ కదా.. మీ సంతోషాన్ని డ్యాన్స్‌ రూపంలో చెప్పండి’ అన్నారు కొందరు. నేను వెంటనే ‘నాగిన్‌ గిన్‌ గిన్‌..’ పాటకి డ్యాన్స్‌ చేశాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఏదిఏమైనా ఆ అనుభవాలు గుర్తొస్తే మనసు అదోలా ఉంటుందని, సమాజం నుంచి ఎదుర్కొన్న విమర్శలు తనను మానసిక వేదనకు గురిచేశాయని వివరించింది రియా.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Arjun Son Of Vyjayanthi Trailer: కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

కళ్యాణ్ రామ్ కొత్త సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ అత్యంత ఉత్కంఠభరింతగా ఉంది. యాక్షన్, రొమాన్స్, సాంగ్స్ ఇలా ప్రతి విషయంలోనూ కట్ చేసిన ట్రైలర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరిస్తుంది.

New Update
Arjun Son Of Vyjayanthi Trailer | Nandamuri Kalyan Ram | Vijayashanti

Arjun Son Of Vyjayanthi Trailer | Nandamuri Kalyan Ram

నందమూరి కల్యాణ్‌రామ్‌, విజయశాంతి తల్లీకొడుకులుగా నటించిన కొత్త సినిమా ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’. సయీ మంజ్రేకర్‌ ఇందులో హీరోయిన్‌‌గా నటిస్తోంది. కొత్త దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో మేకర్స్ అదిరిపోయే సర్ ప్రైజ్ అందించారు.

ట్రైలర్ అదుర్స్

ఇవాళ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రైలర్‌ విడుదల చేశారు. ఫుల్ యాక్షన్‌ సన్నివేశాలతో ఈ ట్రైలర్ అదిరిపోయింది. టైటిల్‌కు తగ్గట్లుగా తల్లీకొడుకుల అనుబంధానికి ఎంతో ప్రాధాన్యమున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి. 

(Arjun Son Of Vyjayanthi)

Advertisment
Advertisment
Advertisment