Moves:జాతీయ అవార్డు కాంబినేషన్ తో వచ్చేస్తున్న సూర్య

జాతీయ అవార్డు గ్రహీత సుధాకొంగర...సూర్యతో మరోసారి వచ్చేస్తున్నారు. ఈ హిట్ కాంబినేషన్ తో రాక్ చేయడానికి వచ్చేస్తున్నారు. ప్రస్తుతానికి సూర్య 43 అనే పేరు పెట్టారు ఈ ప్రాజెక్టుకి. దుల్కర్ సల్మాన్, నజ్రియా ఫాహద్, విజయ్ వర్మ లు ఇందులో కీలక రోల్స్ చేస్తున్నారు.

New Update
Moves:జాతీయ అవార్డు కాంబినేషన్ తో వచ్చేస్తున్న సూర్య

2020లో సుధాకొంగర సూరరై పొట్రు సినిమా తీశారు. సూర్య ఇందులో క‌థానాయ‌కుడు. తెలుగులో ఆకాశం నీ హ‌ద్దురా టైటిల్ తో విడుద‌లై ఇక్క‌డా ఘ‌న‌విజ‌యం సాధించింది. ఈ చిత్రం ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్ గోపీనాథ్ పాక్షిక బయోపిక్. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవ‌డ‌మే గాక బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ళ‌ు కూడా సాధించింది. దాంతో పాటూ జాతీయ అవార్డులనూ సొంతం చేసుకుంది.

ఈ మూవీ తర్వాత సుధాకొంగర, సూర్య కాంబినేషన్ లో మళ్ళీ మూవీ వస్తుందని చాలా రోజుల నుంచి చెబుతూ ఉన్నారు. అయితే అది కార్య రూపం దాల్చడానికి చాలా రోజులే పట్టింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. తాజాగా సూర్య 43వ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహించనున్నారని స‌మాచారం. దీనికి తాత్కాలికంగా సూర్య 43 అని పేరు పెట్టారు. ప్రతిభావంతులైన నటులు దుల్కర్ సల్మాన్, నజ్రియా ఫహద్, విజయ్ వర్మ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో కీల‌క పాత్ర‌లు పోషించనున్నారు. దీనికి సంబంధించి మూవీ టీమ్ గ్లింప్స్ ను రిలీజ్ చేసింది. ఇందులో కోపంతో చూస్తున్న సూర్య కళ్ళు...వాటి మీదకు చిమ్ముతున్న రక్తం తో ఉన్న పోస్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. పోస్టర్ తోనే స్ట్రాంగ్ వైబ్స్ ని సృష్టించారు సుధా కొంగర.

Also Read:హైదరాబాద్ పేలుళ్ళ కుట్ర కేసులో తీర్పు

సూర్య 43 సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఇది జీవీ ప్ర‌కాష్ కి మైలు రాయి చిత్రం.ఇది అత‌డికి 100వ సినిమా కావ‌డం విశేషం. 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. లిమిటెడ్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. టీమ్ మొత్తం సినిమా గురించి చాలా ఎగ్జైటింగ్ గా ఉందని సూర్య ట్వీట్ చేశారు. మేము మరోసారి ఎమోషనల్ రైడ్‌లో ఉన్నట్లు కనిపిస్తోందని అన్నారు.

ఆకాశమే నీ హద్దురాతో ఒక స్ఫూర్తినిచ్చే కథను తీసి హిట్ కొట్టిన సుధా కొంగర ఈ సారి ఎలాంటి సినిమాతో సూర్యను చూపించబోతున్నారో. ఎయిర్ డెక్క‌న్ అధినేత‌. అత‌డి పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశాడు సూర్య‌. ఇప్పుడు సుధ కొంగ‌ర‌తో ఎలాంటి క‌థాంశంలో న‌టిస్తారు? అన్న‌ది స‌స్పెన్స్. త్వ‌ర‌లోనే దీన‌కి జ‌వాబు దొరుకనుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు