Maoist : 30 ఏళ్ల అజ్ఞాతవాసం.. లొంగుబాటలో మావోయిస్టు జ్యోతక్క?

మావోయిస్టు జ్యోతక్క అడవిబాట విడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 54 ఏళ్ల వయసున్న జ్యోతక్క అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నందునే జనజీవనస్రవంతిలో కలిసేందుకు నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆమె వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేట నివాసి.

New Update
Maoist : 30 ఏళ్ల అజ్ఞాతవాసం.. లొంగుబాటలో మావోయిస్టు జ్యోతక్క?

Telangana : మావోయిస్టు జ్యోతక్క(Maoist Jyothi Akka) లొంగుబాటలో ఉన్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా అనారోగ్య సమస్య(Health Problem) లతో సతమతమవుతున్న ఆమె లొంగిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన జ్యోతక్క మూడు దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతుంది. అలాగే జ్యోతక్కతోపాటు మరో కొంతమంది కూడా లొంగిపోయేందుకు సిద్ధమయ్యారని, జ్యోతక్కతోపాటు అలియాస్ సాంబలక్ష్మీలు అడవిబాట విడనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా చదవండి : Karimnagar : కరీంనగర్ లో భారీ నగదు సీజ్.. బీఆర్ఎస్ నాయకుడిదేనంటూ ప్రచారం!

30 ఏళ్ల క్రితం అడవి బాట..
ఇక ప్రస్తుతం 54 ఏళ్ల వయసున్న జ్యోతక్క వరంగల్ జిల్లా(Warangal District)  ఖానాపూర్ మండలం బుధరావుపేట నివాసి. 30 ఏళ్ల క్రితం అడవి బాట పట్టిన జ్యోతక్క పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ(Special Zonal Committee) లో టైలరింగ్ టీమ్లో(Tailoring Team) సభ్యురాలిగా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ప్రస్తుతం ఆమెను అరోగ్య సమస్యలు వెంటాడుతున్నందున ఆమె జనజీవనస్రవంతిలో కలిసేందుకు నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించినట్లు చర్చ నడుస్తోంది. వీలైనంత త్వరగా అటవీ ప్రాంతం నుంచి స్వస్థలానికి రావాలని ఆమె భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

మధ్యప్రదేశ్‌ లో ఓ వింత దొంగతనం జరిగింది. అప్పుల వాళ్ల బాధలు భరించలేక దొంగతనం చేశాడు ఓ వ్యక్తి.అంతేకాకుండా తనని క్షమించాలని,ఆరు నెలల్లో ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తానని,లేని పక్షంలో పోలీసులకు పట్టించవచ్చని నిందితుడు ఓ లేఖను కూడా ఉంచాడు.

New Update
money

money

అప్పుల వాళ్ల వేధింపులు భరించలేకపోతున్నానంటూ ఓ బాధితుడు దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు.అంతటితో ఆగకుండా..తనను క్షమించాలని,డబ్బును ఆర్నెళ్లలో తిరిగి ఇచ్చేస్తానని టైప్‌ చేసి ఉంచిన లేఖను సైతం వదిలి వెళ్లడం గమనార్హం.మధ్యప్రదేశ్‌ లోని ఖర్గోన్‌ జిల్లాల్లో ఓ వింత వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Also Read: ఐదు విమానాల్లో అమెరికాకు ఐఫోన్లు.. ట్రంప్ సుంకాలకు అలా షాకిచ్చిన యాపిల్!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ...స్థానికంగా ఓ దుకాణంలో ఆదివారం అర్థరాత్రి దొంగతనం జరిగింది. నిందితుడు రూ.2.45 లక్షలు ఎత్తుకెళ్లాడు.ఈ విషయాన్ని గురించిన యజమాని...ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్లాడు. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దుకాణంలో ఓ లేఖ దొరికింది.

Also Read: TRUMP Tariffs: టారీఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్.. ఈ దేశాలపై సుంకాలు రద్దు..!

తాను దొంగతనం చేయాలనుకోలేదని, కానీ ...వేరే మార్గం లేకపోయిందని నిందితుడు అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.నేను పొరుగు ప్రాంతంలోనే ఉంటాను. కొంతకాలంగా అప్పుల వాళ్ల వేధింపులు ఎక్కువ అయ్యాయి. రామనవమి రోజు చోరీకి పాల్పడినందుకు క్షమాపణలు.నేను దొంగతనం చేయాలనుకోలేదు.

కానీ వేరే మార్గం లేకపోయింది. అవసరమైనంత డబ్బే తీసుకున్నాను. ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను.లేని పక్షంలో పోలీసులకు పట్టించొచ్చు.కానీ ఇప్పుడు మాత్రం ఈ డబ్బు తీసుకుని వెళ్లడం నాకు చాలా ముఖ్యం అని ఆ లేఖలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దుకాణం యజమాని సైతం బ్యాగులో రూ. 2.84 లక్షలు భద్రపర్చగా..అందులో రూ.2.45 లక్షలు కనిపించడం లేదని చెప్పినట్ఉ తెలుస్తుంది.

నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Sharmila fires on YCP :  ప్రజలు చెప్పుతో కొట్టినా పద్ధతి మారలేదు.. వైసీపీపై షర్మిల సంచలన వ్యాఖ్యలు!

Also Read: Trump's another shock : హెచ్ 1బీ, ఎఫ్1 వీసాదారులు, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు ట్రంప్ మరో షాక్..! హెల్ప్ డెస్క్ సస్పెండ్

 note | madhya-pradesh | madhya pradesh news | apology | steals money | police | letter | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment