Suresh Gopi : కేంద్ర మంత్రి పదవికి రాజీనామా.. సురేష్ గోపి కీలక ప్రకటన

నిన్న కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సురేష్ గోపి.. రాజీనామా చేస్తున్నారంటూ ఈ రోజు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఆయన ఖండించారు. అవన్నీ అవస్తవమని స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంలో కేరళ అభివృద్ధి, శ్రేయస్సుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.

New Update
Suresh Gopi : కేంద్ర మంత్రి పదవికి రాజీనామా.. సురేష్ గోపి కీలక ప్రకటన

Suresh Gopi Resign : ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) కేరళ (Kerala) లోని త్రిసూర్ లోక్ సభ స్థానం నుంచి నటుడు సురేష్‌ గోపి (Suresh Gopi) విజయం సాధించిన విషయం తెలిసిందే. కేరళ నుంచి గెలిచిన ఏకైక బీజేపీ ఎంపీ ఆయనే కావడం విశేషం. దీంతో ఆయనకు మంత్రి పదవి సైతం లభించింది. ఆదివారం ప్రధాని మోదీతో పాటు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. ఈ రోజు ఉదయం నుంచి ఆయన రాజీనామాకు సిద్ధం అవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ప్రమాణస్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే సురేష్‌ గోపి మనస్సు మార్చుకున్నారన్నది ఆ వార్తల సారాంశం.

కేంద్రమంత్రి (Central Minister) పదవి నుంచి తనను రిలీవ్ చేయాలని పార్టీని సురేష్ గోపి కోరినట్లు కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో సురేష్ గోపి కొద్ది సేపటి క్రితం తన 'X' ఖాతాలో ఈ అంశంపై పోస్టు చేశారు. తాను కేంద్ర మంత్రి పదవిని వదులుకుంటున్నట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేరళ రాష్ట్ర అభివృద్ధి, శ్రేయస్సుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు సురేష్ గోపి. దీంతో ఈ రోజు ఉదయం నుంచి ఆయన రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలకు చెక్ పెట్టారు సురేష్ గోపి.


Also Read : యూఎఫ్‌సీలో భారత్‌కు తొలి విజయం..చరిత్ర సృష్టించిన పూజా తోమర్‌

#central-minister #resign #suresh-gopi #kerala
Advertisment
Advertisment
తాజా కథనాలు