Delhi: విడాకుల తర్వాత ఏ మతం వారైనా భరణం ఇవ్వాల్సిందే- సుప్రీంకోర్టు భార్య భర్తల విడాకుల తర్వాత ఇచ్చే భరణంపై ఈరోజు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భరణానికి మతంతో సంబంధం లేదని తేల్చి చెప్పింది. ముస్లిం మహిళలు విడాకుల తర్వాత భరణానికి అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. By Manogna alamuru 11 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Supreme Court: ఏ మతం వారైనా భర్తలు భరణం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయం ఏ మతం వారికైనా ఒకేలా వర్తిస్తుందని స్పష్టం చేసింది. 125 సీఆర్‌పీసీ ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టీన్, జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. విడాకుల తర్వాత తమ భర్త నుంచి వారు భరణం కోరవచ్చని తీర్పునిచ్చింది. భరణానికి సంబంధించిన హక్కును కల్పించే సెక్షన్‌ను విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు కూడా వర్తింపజేస్తున్నట్లు సప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. సెక్షన్ 125 వివాహితులకు మాత్రమే కాకుండా మహిళలందరికీ వర్తిస్తుంది తెలిపింది. మతంతో సంబంధం లేకుండా ఈ సెక్షన్ కింద వివాహితులు భరణం కోరవచ్చని చెప్పింది. భరణం ఇవ్వడం అనేది దాతృత్వం కాదు. భార్య తమపై మానసికంగా, ఇతర రకాలుగా ఆధారపడి ఉంటుందనే వాస్తవాన్ని కొందరు భర్తలు గుర్తించడం లేదు. గృహిణి పాత్రను, ఆమె త్యాగాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చిందని ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. Also Read:Andhra Pradesh: తల్లికి వందనం పథకానికి విధివిధానాలు #delhi #supreme-court #home-makers #rights మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి