MLC Kavitha: మరికొన్ని గంటల్లో కవిత బెయిల్‌పై తీర్పు!

TG: దాదాపు 5 నెలలుగా జైలులో ఉన్న కవితకు బెయిల్ వస్తుందా? లేదా? అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఈ నెల 12న కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. కవిత బెయిల్‌పై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

New Update
MLC Kavitha: మరికొన్ని గంటల్లో కవిత బెయిల్‌పై తీర్పు!

MLC Kavitha: ఈడీ, సీబీఐ కేసుల్లో తన బెయిల్ పిటిషన్‌ను (Bail Petition) ఢిల్లీ హైకోర్టు రిజెక్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ పిటిషన్ ను ఈ నెల 12న సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. కాగా సుప్రీం కోర్టు (Supreme Court) ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ స్కాం కేసులో (Delhi Liquor Scam Case) ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ (ED) అరెస్ట్ చేసింది. దాదాపు 150 రోజులుగా ఆమె జైలులోనే ఉంటున్నారు. ఇదే కేసులో సీబీఐ కూడా కవితను జైలులోనే అరెస్ట్ చేసింది.

ఈ కేసుల్లో పలు మార్లు తనకు బెయిల్ కావాలంటూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. ఇటీవల సీబీఐ (CBI) కేసులో తన బెయిల్  పిటిషన్ ను కవిత వెనక్కి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు (Manish Sisodia) సుప్రీం కోర్టు షరతులతో కూడిన  బెయిల్ ను మంజూరు చేయడంతో కవితకు కూడా బెయిల్ వస్తుందనే ఆశ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. మరి కవితకు బెయిల్ వస్తుందో లేదో మరికొన్ని గంటల్లో తేలనుంది.

Also Read: ఈ అనాథ విజయం ప్రపంచానికి స్ఫూర్తి.. ఒలింపిక్ విజేత అమన్ లైఫ్ స్టోరీ ఇదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు