Breaking : జగన్ సర్కార్‎కు సుప్రీం ఝలక్..!!

సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ సర్కార్ దాఖలు చేసిన వేర్వేరు పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పుంగనూరు అంగళ్లు కేసులో ప్రభుత్వం దాఖలు చేసిసన పిటిషన్ విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అయితే గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్ధించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వుల విషయంలో తాము కలగజేసుకోమని ధర్మాసనం స్పష్టం చేసింది.

New Update
Supreme Court : నారీ శక్తి అంటూ గొంతులు చించుకుంటారు కదా.. ఇక్కడ చూపించండి మరి!

సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ సర్కార్ దాఖలు చేసిన వేర్వేరు పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పుంగనూరు అంగళ్లు కేసులో ప్రభుత్వం దాఖలు చేసిసన పిటిషన్ విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అయితే గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్ధించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వుల విషయంలో తాము కలగజేసుకోమని ధర్మాసనం స్పష్టం చేసింది. అంగళ్లు కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వడంపై అభ్యంతరం తెలుపుతూ ఏపీ సర్కార్ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై విచారించిన సుప్రీం ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏంటని ప్రశ్నించింది.

కాగా రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ పై జస్టిస్‌ అనిరుద్ద బోస్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేది సుప్రీంకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. పుంగనూరు అంగళ్లు ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. సామాన్యులకు భద్రత కల్పించాల్సిన పోలీసులే..సాక్షులుగా ఎఫ్ఐఆర్ ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పోలీసు అధికారులు గాయపడ్డారని, ఓ కానిస్టేబుల్ ఫిర్యాదు దారుగా ఉన్నారని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పోలీసులే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి పోలీసులే సాక్షులుగా ఉంటారా అంటూ సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.

ఇది కూడా చదవండి:  దేశంలో మళ్లీ మోదీదే హవా…తగ్గేదేలేదు..!!

అయితే హైకోర్టు బెయిల్‌ ఇచ్చింది కాబట్టి ఆ విషయంలో తాము జోక్యం చేసుకోడానికి ఏమీ లేదని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. అటు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఆరు వేరు వేరు పిటషన్లను కూడా సుప్రీం కొట్టివేసింది.

ఇక అంగళ్లు ఘటనలో టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. విచారణ తర్వాత టీడీపీ నేతలకు బెయిల్‌ మంజూరు చేసింది హైకోర్టు. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏసీ సర్కార్ సుప్రీంకోర్టులో 6 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. తెలుగుదేశం నేతలు దేవినేని ఉమా మహేశ్వరరావు, చల్లా రామచంద్రారెడ్డి అలియాస్‌ చల్లా బాబు, నల్లారి కిషోర్‌ కుమర్‌ రెడ్డిలకు మంజూరు చేసిన బెయిల్‌ రద్దు చేయాలని ఏపీ సర్కార్ ను కోరింది.

ఇది కూడా చదవండి: ఇంకెన్నాళ్ళు అబద్ధాలు చెబుతారు- ప్రధాని మోదీ మీద కేటీఆర్ సెటైర్లు

Advertisment
Advertisment
తాజా కథనాలు