Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం తీర్పు.. అవి తీసుకున్నవారు టాక్స్ కట్టాలా? ఎలక్టోరల్ బాండ్స్ చెల్లవు అని సుప్రీం తీర్పు చెప్పింది. దీంతో అప్పట్లో బాండ్స్ తీసుకున్నవారు టెన్షన్ లో పడ్డారు. ఈ బాండ్స్ టాక్స్ ఫ్రీ అని ప్రభుత్వం చెప్పింది. కానీ, ఈ తీర్పుతో అప్పట్లో తాము తీసుకున్న బాండ్స్ పై ఇప్పుడు టాక్స్ కట్టాల్సి వస్తుందా అనేది వారి ఆందోళన By KVD Varma 20 Feb 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Electoral Bonds: ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు (Supreme Court) రాజ్యాంగ ధర్మాసనం ఫిబ్రవరి 15న కీలక నిర్ణయం తీసుకుంది. 2018లో రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం కోసం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని 'రాజ్యాంగ విరుద్ధం' అంటూ స్పష్టంగా పేర్కొంది. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ (Article) 19 కింద పొందే ప్రజల ప్రాథమిక సమాచార హక్కుకు విరుద్ధమని చెప్పింది. ఈ నిర్ణయం తర్వాత, ఇంతకు ముందు ఎలక్టోరల్ బాండ్స్ కొని వాటి నుంచి ఆదాయపు పన్ను క్లెయిమ్ పొందిన వారిలో ఆందోళన పెరిగింది. అప్పట్లో ఆ బాండ్ల పై ఎటువంటి టాక్స్ కట్టలేదు. మరి సుప్రీం తీర్పుతో అప్పుడు తీసుకున్న బాండ్లకు ఇప్పుడు టాక్స్ కట్టాల్సి వస్తుందా అనే అనుమానం వారిని పట్టి పీడిస్తుంది. మరి ఇప్పుడు ఈ బాండ్లకు బదులుగా వారు పన్ను చెల్లించవలసి ఉంటుందా? ఇక్కడ అర్థం చేసుకుందాం… సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎలక్టోరల్ బాండ్ల జారీని తక్షణమే నిషేధించారు. అలాగే, ఏప్రిల్ 2019 నుండి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన అన్ని ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని పంచుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరింది. అంతేకాకుండా, ఎలక్టోరల్ బాండ్ల నుండి ఏ పార్టీకి ఎంత విరాళం వచ్చిందో చెప్పాలని కూడా అడిగింది ధర్మాసనం. మార్చి 6లోగా ఈ సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలని ఎన్నికల కమిషన్‌ను కూడా ఆదేశించింది. అయితే ఈ విషయంలో ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసేవారిలో ఆందోళన నెలకొంది. 100% పన్ను మినహాయింపు.. ఎలక్టోరల్ బాండ్లను రూ.1,000, రూ.10,000, రూ.లక్ష, రూ.10 లక్షలు, రూ.1 కోటి విలువలతో కొనుగోలు చేస్తారు. SBI ఒక్కటే వీటిని జారీ చేస్తుంది. అలాగే ఎవరు కొన్నారు అనే విషయాన్ని రహస్యంగా ఉంచుతుంది. ఎలక్టోరల్ బాండ్ల (Electoral Bonds)చెల్లుబాటు 15 రోజులు మాత్రమే ఉంటుంది. కొన్నవారు దానిని 15 రోజుల్లోపు ఏ పార్టీకి ఇవ్వకపోయినా, లేదా దానిని తీసుకున్న పార్టీ నగదు గా మార్చుకోకపోయినా, ఈ డబ్బు అంతా ప్రధానమంత్రి సహాయనిధికి వెళుతుంది. ఈ రెండు పరిస్థితుల్లోనూ, విరాళంగా ఇచ్చిన మొత్తంపై 100 శాతం పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80GGB, సెక్షన్ 80GGC ప్రకారం, రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలపై 100 శాతం పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇప్పుడు అది చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించడంతో దానికి బదులుగా తీసుకున్న పన్ను మినహాయింపు తిరిగి చెల్లించాల్సి ఉంటుందా? అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. పన్ను కట్టాలా? ఎలక్టోరల్ బాండ్ల (Electoral Bonds) గుర్తింపు - దాని చెల్లుబాటును గోప్యంగా ఉంచడంపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. దాని టాక్స్ అంశం ఇందులో చర్చించలేదు. అందువల్ల ఇప్పుడు వెంటనే సమాచారాన్ని బహిరంగపరచవలసి ఉంటుందని, ఆపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నుండి స్పష్టత కోసం వేచి ఉండవలసి ఉంటుందని నిపుణులు అంటున్నారు. Also Read: పేటీఎం షేర్లు పెరుగుతున్నాయి.. ఈ బూమ్ నిలబడేనా? అయితే, సుప్రీం కోర్టు తీర్పులో, సెక్షన్ 80GGB - సెక్షన్ 80GGC కింద లభించే మినహాయింపు గురించి ఏమీ చెప్పలేదు. దీనికి సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు కూడా నమోదు కాలేదు. అటువంటి పరిస్థితిలో, ఎలక్టోరల్ బాండ్లపై పన్ను మినహాయింపుకు సంబంధించి స్పష్టత కోసం వేచి ఉండటం సరైనదని వారంటున్నారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలకు ముందు, ఏప్రిల్ 2023, జూలై 2023, అక్టోబర్ 2023, జనవరి 2024లో జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్(Electoral Bonds)లను పార్టీలు ఎన్‌క్యాష్ చేశాయి. ఎందుకంటే వాటిని ఎన్‌క్యాష్ చేసుకోవడానికి కేవలం 15 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. అదే సమయంలో, ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేటప్పుడు పన్ను చెల్లింపుదారులు ఈ విరాళాలపై పన్ను క్లెయిమ్ చేయవలసి వస్తే, వారి పేర్లను రహస్యంగా ఉంచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వ్యక్తులు లేదా కంపెనీలు రాజకీయ పార్టీల పేర్లను ఐటీఆర్‌లో వెల్లడించాల్సిన అవసరం లేదు. , కానీ ఎవరికి వారు వీటిని ఇచ్చారు? ఆ రాజకీయ పార్టీల పాన్ నంబర్, వాటికి ఇచ్చిన బాండ్ల సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. Watch this Interesting Video : #supreme-court #electoral-bond మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి