BREAKING: బాణసంచా నిషేధం అన్ని రాష్ట్రాలకు.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

ఢిల్లీ బాణసంచా నిషేధం అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని తేల్చి చెప్పింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు నియంత్రణపై చర్యలు తీసుకోవాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది.

New Update
BREAKING: బాణసంచా నిషేధం అన్ని రాష్ట్రాలకు.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

Crackers Ban: వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ బాణసంచా నిషేధం అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు నియంత్రణపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. బాణసంచాను నియంత్రించే ఆదేశాలు ఢిల్లీకి మాత్రమే పరిమితం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాణసంచాలో బేరియం సహా.. నిషేధిత రసాయనాల వాడకానికి వ్యతిరేకంగా గతంలో ఇచ్చిన ఆదేశాలు దేశమంతటా వర్తిస్తాయని తెలిపింది.

Also Read: రాళ్లతో కొట్టి ఆంధ్రకు పంపుతాం.. షర్మిలకు సొంత నేతల షాక్!

“పర్యావరణ రక్షణ విషయంలో కోర్టులదే బాధ్యత అన్నట్లు తప్పుడు అభిప్రాయంలో ఉంటారు. వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యాలను నియంత్రించడం ప్రతి ఒక్కరికీ సంబంధించినది” అని సుప్రీం కోర్టు పేర్కొంది. ఉదయపూర్‌లో వాయు, ధ్వని కాలుష్యాన్ని తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ ప్రభుత్వాన్ని కోరింది. అలాగే కాలుష్యాన్ని నియంత్రించేందుకు అన్నీ రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రావాలని పేర్కొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు