IPL : చెన్నై పై సన్ రైజర్స్ విజయం!

ఐపీఎల్‌ 2024 లో భాగంగా శుక్రవారం సన్‌ రైజర్స్- చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య రసవత్తర మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ లో సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ పై గెలిచింది. సొంత గడ్డ పై గెలిచి సన్‌ రైజర్స్‌ తన సత్తా చాటింది

New Update
IPL : చెన్నై పై సన్ రైజర్స్ విజయం!

SRH : ఐపీఎల్‌ 2024(IPL 2024) లో భాగంగా శుక్రవారం సన్‌ రైజర్స్- చెన్నై సూపర్‌ కింగ్స్‌(CSK) మధ్య రసవత్తర మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ లో సన్‌రైజర్స్ 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ పై గెలిచింది. సొంత గడ్డ పై గెలిచి సన్‌ రైజర్స్‌ తన సత్తా చాటింది. 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.1 ఓవర్లలోనే అందుకుంది.

సన్‌ రైజర్స్‌(Sun Risers Hyderabad) బ్యాటర్లలో మార్క్రమ్ (50) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.. అలాగే ఓపెనర్లు.. ట్రేవిస్ హెడ్ 31, అభిషేక్ శర్మ 37 పరుగులు చేసారు. అభిషేక్ శర్మ కేవలం 12 బంతుల్లో 37 పరుగులతో మెరుపు ఇన్సింగ్స్ తో ఆడి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. షాబాజ్ అహ్మద్ 18, క్లాసెన్ 10, చివరలో నితీశ్ కుమార్ 14 పరుగులు చేశాడు.

చివరిలో సిక్స్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీపక్ చాహర్, మహీష్ తీక్షణ తలో వికెట్ తీశారు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు లక్ష్యాన్ని సన్‌ రైజర్స్ ముందు ఉంచింది

చెన్నై బ్యాటింగ్ లో శివం దూబే అత్యధికంగా 45 పరుగులు పూర్తి చేశాడు. ఆ తర్వాత రహానే 35, గైక్వాడ్ 26, చివరలో జడేజా 31 పరుగులు చేయడంతో 165 పరుగులు ఇచ్చింది. చివరలో ధోనీ బ్యాటింగ్ కు దిగడంతో స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో దద్దరిల్లింది. ఈ గెలుపుతో సన్ రైజర్స్ తన ఖాతా రెండో విజయాన్ని వేసుకుంది. చెన్నై కూడా నాలుగు మ్యాచ్ ల్లో రెండు గెలుచుకుంది.

Also read: ఆందోళనతో గుండె కొట్టుకోవడం పెరుగుతుంది.. అలా ఎందుకు జరుగుతుందో తెలుసా!

Advertisment
Advertisment
తాజా కథనాలు