Rajinikanth : విజయ్ సేతుపతి 'మహారాజ' కు రజినీకాంత్ ఫిదా.. డైరెక్టర్ ను ఏకంగా ఇంటికి పిలిపించిన సూపర్ స్టార్

విజయ్‌సేతుపతి నటించిన ‘మహారాజ’ సినిమాను రజినీకాంత్ ఇటీవలే వీక్షించారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ ను తన నివాసానికి ఆహ్వానించి ప్రశంసించారు. ఆ సమయంలో రజనీతో దిగిన ఫోటోలను దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు..

New Update
Rajinikanth : విజయ్ సేతుపతి 'మహారాజ' కు రజినీకాంత్ ఫిదా.. డైరెక్టర్ ను ఏకంగా ఇంటికి పిలిపించిన సూపర్ స్టార్

Vijay sethupathi Maharaja Movie : కోలీవుడ్ స్టార్ విజయ్‌సేతుపతి హీరోగా నటించిన ‘మహారాజ’ సినిమా ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్‌ వద్ద కొత్త రికార్డులు సృష్టించింది. సస్పెన్స్‌, సెంటిమెంట్‌తో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్‌ నిథిలన్‌ స్వామినాథన్‌ ప్రతిభకు అందరూ ఫిదా అయ్యారు.

ఈ క్రమంలోనే తాజాగా ఆయన్ను సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభినందించారు. ఇటీవల ఈ సినిమాను చూసిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. డైరెక్టర్ ను తన నివాసానికి ఆహ్వానించి ప్రశంసించారు. రజనీకాంత్‌తో కలిసి తీసిన ఫోటోలను దర్శకుడు నిథిలన్‌ తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఆయనతో సమావేశమైనందుకు ఆనందం వ్యక్తం చేశారు. రజనీకాంత్‌ తనతో సినిమా, జీవితం గురించి చాలా విషయాలు పంచుకున్నారని తెలిపారు. మీ మాటలు బంగారు అక్షరాలతో వ్రాసిన నవల చదివినట్లుగా ఉన్నాయి. వాటి నుంచి నేను తమిళ సినిమా ప్రపంచంలో మరో జీవితాన్ని చవిచూస్తాను. మీ జీవితానుభవ విషయాలు నాతో పంచుకుని చాలా సంతోషాన్ని ఇచ్చారు. మీ వినయం, ఆతిథ్యానికి నేను ఎప్పటికీ మరిచిపోలేనుని పేర్కొన్నారు.

‘మహారాజ’ సినిమా విజయం తర్వాత ఇది మరో గొప్ప అవార్డులాంటిదని, ఈ సమావేశం తన కెరీర్‌కు మరింత స్ఫూర్తిని ఇచ్చిందని నిథిలన్‌ పేర్కొన్నారు. ఇక విజయ్ సేతుపతి కెరీర్ లో 50 వ మైలు రాయి చిత్రంగా తెరకెక్కిన 'మహారాజ' కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ తో రూపొంది, బాక్సాఫీస్‌ వద్ద రూ. 100 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు