/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-103.jpg)
Delhi Play Offs : 2024 ఐపీఎల్(IPL 2024) సీజన్ లో, ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్టను ప్లేఆఫ్స్ కు తీసుకువెళ్ళటానికి కెప్టెన్ రిషబ్ పంత్(Rishab Pant) చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ అతని అశలు ఇప్పుడు నీరు కారే పరిస్థితి నెలకొంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి సుమారు ఏడాదిన్నర పాటు క్రికెట్ కు పంత్ దూరంగా ఉన్నాడు.పంత్ ఈ సీజన్ లో బ్యాట్ తోను,కెప్టెన్సీ లోను సత్తా చాటాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 14 మ్యాచ్‌ల్లో 7 గెలిచింది. మొదట సూపర్ ఫాంలో ఉన్నఆ జట్టు పలువురు ఆటగాళ్లు గాయాల కారణంగా..కొన్ని మ్యాచ్ లు చేతులారా చేజార్చుకుంది.
నిన్న జరిగిన మ్యాచ్ లో లక్నో(Lucknow Super Giants) పై ఢిల్లీ జట్టు 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం ఆ జట్టు 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఢిల్లీ జట్టు నికర రన్ రేట్ -0.377 గా ఉంది. ఈ సమయంలో జట్టు ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే ఢిల్లీకి ఒకే ఒక్క అవకాశం ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్(Sun Risers Hyderabad) తన మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో 100 పరుగుల తేడాతో ఓడిపోవాల్సి ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తర్వాత గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌లతో లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. ఒక్కో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 100 పరుగులకు పైగా ఓడిపోతే ఆ జట్టు నెట్ రన్ రేట్ దెబ్బతింటుంది. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సన్‌రైజర్స్ జట్టును అధిగమించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానాన్ని ఆక్రమించగలదు.
చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌లో ఎవరు గెలిచినా, ఓడినా ఢిల్లీ ప్లే ఆఫ్‌కు చేరుకుంటుంది. సన్‌రైజర్స్ మిగిలిన రెండు మ్యాచ్ లు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తో తలుపడుతుంది. సూపర్ ఫాంలో సన్ రైజర్స్ ఈ రెండు మ్యాచ్ ల్లో భారీగా ఓడిపోవటం సుసాధ్యం గా కనిపిస్తుంది.ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఢిల్లీకీ ఫ్లే ఆఫ్స్ కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.
Also Read : ఐపీఎల్‌కు రోహిత్ శర్మ గుడ్‌బై..? షాక్‌లో ఫ్యాన్స్