Telangana : రాష్ట్రంలో పాఠశాలలకు నేటి నుంచి సమ్మర్ హాలిడేస్..

రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు అన్ని రకాల మేనేజ్‌మెంట్ల పరిధిలోని పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు.

New Update
Telangana: తెలంగాణ ఉన్నత పాఠశాలల పనివేళల్లో మార్పు!

Schools : రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు బుధవారం నుంచి వేసవి సెలవులు(Summer Holidays) ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు అన్ని రకాల మేనేజ్‌మెంట్ల పరిధిలోని పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఒకవేళ వేసవి సెలవుల్లో ఎవరైన ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తే.. కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక జూన్‌ మళ్లీ పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి.

Also Read: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిపై సస్పెన్స్.. తెరపైకి ప్రియాంక గాంధీ పేరు..

ఈ విద్యా సంవత్సరం(Academic Year) లో పాఠశాలలకు మంగళవారమే చివరి పనిదినంగా ఉంది. ఈ సందర్భంగా ఇటీవల ముగిసిన సమ్మెటివ్ అసెస్మెంట్ - 2 పరీక్ష ఫలితాలను మంగళవారం పాఠశాలలో ప్రకటించారు. మరికొన్ని పాఠశాలలో వీటికి సంబంధించి చిన్న వేడుకలను కూడా నిర్వహించారు. మరోవైపు బయట ఎండలు కూడా రోజురోజుకి పెరగడంతో పిల్లలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) లో కూడా నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్కడ కూడా జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.

Also Read: ఈరోజు నుంచి కేసీఆర్ బస్సు యాత్ర..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP: కియా ప్లాంట్ నుంచి 900 ఇంజిన్లు దొంగతనం

ఆంధ్రప్రదేశ్ లో శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలోని ఉన్న కియా పరిశ్రమ నుంచి కార్ల ఇంజిన్లు మాయం అయ్యాయి. అది కూడా ఒకటి రెండు కాదు ఏకంగా 900 కనిపించకుండా పోయాయి. దీనికి సంబంధించి కియా యాజమాన్యం కిందటి నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

New Update
ap

KIA Industry

కియా ప్లాంట్ లో ఇంజిన్లు పోయాయి. నమ్మశక్యంగా లేకపోయినా..ఇది నిజంగా జరిగింది. అది కూడా ఆంధ్రాలో ఉన్న కియా పరిశ్రమలో. అది కూడా ఏదో ఒకటి , రెండో పోతే పర్వాలేదులే అనుకోవచ్చును. కానీ ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం అయ్యాయి. దీనికి సంబంధించి కియా ప్లాట్ ఓనర్లు మార్చి 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దొంగతనం విషయంలో కియా యాజమాన్యం ఫిర్యాదు లేకుండా దర్యాప్తు చేపట్టాలని పోలీసులను కోరారు. కానీ దీనికి పోలీసులు నిరాకరించడంతో కంప్లైంట్ ఫైల్ చేశారు.  విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని పోలీసు ఉన్నతాధికారులు నియమించారు.

ఎక్కడ మాయం అయ్యాయో..

అయితే ఈ కార్ల ఇంజిన్లు ఎక్కడ పోయాయి అన్నది మాత్రం తెలియడం లేదు. ఆంధ్రాలో ఉన్న ప్లాంట్లో కార్లు తయారవుతాయి కానీ విడి భాగాలు అన్నీ ఒక్కో చోట నుంచీ వస్తాయి. కార్ల ఇంజిన్లు తమిళనాడు నుంచి వస్తాయి. ఇప్పుడు మాయం అయిన ఇంజిన్లు తమిళనాడు నుంచి రవాణా అవుతున్నప్పుడు పోయాయా లేక పరిశ్రమలోనే చోరీ అయ్యాయా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి విచారణ పూర్తి చేశారని...త్వరలోనే మీడియా సమావేశం పెట్టి వివరాలు తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. 

 

 today-latest-news-in-telugu | kia | cars | andhra-pradesh 

 

Also Read: Stock Market: నిన్న అధ:పాతాళానికి..ఈరోజు లాభాల్లో..

 

Advertisment
Advertisment
Advertisment