అమెరికాల టారిఫ్ ల భారం ప్రభావం ఏపీపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇండియా నుంచి దిగుమతి చేసుకునే మత్స్య ఉత్పత్తులపై 27 శాతం ఇంపోర్ట్ టారిఫ్‌ను ట్రంప్ విధించిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బ ఇప్పుడు గోదావరి జిల్లాల్లోని ఆక్వా రైతులకు చాలా గట్టిగా తగిలింది. దీంతో తాము చాలా నష్టపోయామని.. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవిషయం గురించి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు రైతులు, వ్యాపారులు, హేచరీలు, దాణా తయారీ సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. సమస్యల పరిష్కారానికి కేంద్రంతో సంప్రదిస్తామని హామీ ఇచ్చారు.
Also Read: Telangana: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!
రాష్ట్ర జీడీపీలో మత్స్యరంగం కీలకమని, ఆక్వా రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాపారులకు సూచించారు. 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 ఇవ్వాలని కోరారు. ఆక్వా రంగం సమస్యల పరిష్కారం కోసం 11 మందితో కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Trump-China: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!
సుంకాల భారం నుంచి బయటపడటానికి, ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కమిటీలో ఆక్వా రైతులు, ఆక్వా రంగ నిపుణులు, ప్రభుత్వ అధికారులు, భాగస్వాములు, ఎంపెడా ప్రతినిధులు, ఎగుమతిదారులు.. మొత్తం 11 మంది ఉంటారు. రైతుల నుంచి కె.రఘు, కుమారరాజు, రామరాజు (ఏపీఐఐసీ ఛైర్మన్), శ్రీకాంత్.. ఎగుమతిదారుల నుంచి కె.ఆనంద్, ఆనంద్‌కుమార్, ఎన్.వెంకట్, డి.దిలీప్.. హేచరీల ప్రతినిధులుగా పీవీబీ కుమార్, ఎస్‌ఎస్‌ఎన్ రెడ్డి, ఫీడ్ మిల్లుల తరఫున సుబ్రహ్మణ్యం సభ్యులుగా ఉంటారు. ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో చర్చించి రెండు, మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆ కమిటీకి చంద్రబాబు సూచించారు.
ఈ క్రమంలో దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని ఎగుమతిదారులు అభిప్రాయపడ్డారు. దీనిపై కేంద్రంతో మాట్లాడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని.. మళ్లీ సంప్రదిస్తామని పేర్కొన్నారు. ఆక్వా సాగులో 3 లక్షల మంది రైతులున్నారని.. ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 50 లక్షల మంది ఆధారపడి ఉన్నారన్నారు. ఇది ఊహించని సమస్య అని.. ఈ సమస్య పై రైతులు ఓపికగా ఉండాలన్నారు.
ఆక్వా ఎగుమతులపై అమెరికా విధిస్తున్న సుంకాల భారాన్ని రైతుల పైకి నెట్టకుండా వ్యాపారులు, ఫీడ్‌మిల్లులు, హేచరీలు బాధ్యత తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. రొయ్యకు స్థానిక వినియోగం పెంచేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ పరిస్థితి చక్కబడే వరకు రైతుకు ధైర్యం కల్పించాలని.. రైతుకు గిట్టుబాటు రేటు ఇచ్చేలా వ్యాపారులు చూడాలి అన్నారు. కొంతమంది రైతులు క్రాప్ హాలిడే అని ప్రకటించడంతో.. ఈ అంశంపైనా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చర్చించనుంది.
Also Read: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!
Also Read: Maoists surrender : పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు
cbn | trump | tarriffs | trump tariffs | trump tariffs india | trump tariffs news | trump tariff war | donald trump tariffs | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates