Sukumar : బన్నీ ఫ్యాన్స్ కి షాక్.. 'పుష్ప 2' క్లైమాక్స్ చేంజ్, సుకుమార్ సడెన్ ట్విస్ట్!

'పుష్ప 2' క్లైమాక్స్ ని మార్చాలని సుకుమార్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడట. 'పుష్ప 2' కోసం కూడా రెండు క్లైమాక్స్ లు ప్లాన్ చేశాడట. రెండిటిలో ఒకటి యాడ్ చేయాలని భావించగా.. ముందుగా అనుకున్న క్లైమాక్స్ కాకుండా వేరే క్లైమాక్స్ యాడ్ చేసే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Sukumar : బన్నీ ఫ్యాన్స్ కి షాక్.. 'పుష్ప 2' క్లైమాక్స్ చేంజ్, సుకుమార్ సడెన్ ట్విస్ట్!

Sukumar Shocking Decision For Pushpa 2 : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తన సినిమా విషయంలో ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. ఎందుకంటే అవుట్ ఫుట్ విషయంలో అయన ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడు. బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చే వరకు ట్రై చేస్తూనే ఉంటాడు. దానికోసం రిలీజ్ డేట్ కూడా వాయిదా పడ్డ రోజులున్నాయి. ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న 'పుష్ప' 2 విషయంలోనూ ఇదే జరుగుతోంది.

గత ఏడాది చివర్లోనే రిలీజ్ కావాల్సిన 'పుష్ప 2' (Pushpa 2) షూటింగ్ ఆలస్యం వల్ల ఆగస్టు 15 కి వాయిదా పడింది. రిలీజ్ టైం దగ్గర పడుతున్నా ఇంకా షూటింగ్ కంప్లీట్ కాకపోవడం బన్నీ ఫ్యాన్స్ లో పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇలాంటి తరుణంలో సుకుమార్ ఇప్పుడు మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. 'పుష్ప 2' క్లైమాక్స్ ని మార్చాలని సుకుమార్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడట.

క్లైమాక్స్ చేంజ్...

మాములుగా సుకుమార్ తన సినిమాలకి రెండు క్లైమాక్స్ లు రాసుకుంటాడు. 'పుష్ప 2' కోసం కూడా రెండు క్లైమాక్స్ (Climax) లు ప్లాన్ చేశాడట. రెండిటిలో ఒకటి యాడ్ చేయాలని భావించగా.. ముందుగా అనుకున్న క్లైమాక్స్ కాకుండా వేరే క్లైమాక్స్ యాడ్ చేసే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు తెలుస్తోంది.

'పుష్ప 2' కి కొనసాగింపుగా పార్ట్- 3 కూడా చేయాలనే ఆలోచన రావడంతో సుకుమార్ పుష్ప 2 క్లైమాక్స్ కూడా పార్ట్-3 కి సూట్ అయ్యేలా ప్లాన్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే క్లైమాక్స్ పార్ట్ ను మల్లి రీ షూట్ చేయాల్సి వస్తుంది. దానికి ఇంకాస్త టైం కావాలి. మరి రిలీజ్ డేట్ కి ముందే సుకుమార్ దాన్ని ఫినిష్ చేస్తారేమో చూడాలి..

Also Read : ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాదే అధికారం.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు