Sukumar : ఆ సినిమా రిలీజ్ టైమ్ లో దిల్ రాజు కాళ్ళు పట్టుకున్న సుకుమార్.. అసలేం జరిగిందంటే?

'ఆర్య' 20 ఇయర్స్ సెలెబ్రేషన్స్ లో సుకుమార్ దిల్ రాజు, తన మధ్య జరిగిన గొడవ గురించి వివరించారు. ఆర్య లో మాంటేజ్ సాంగ్ తీయాలని దిల్ రాజుతో చెబితే అయన ఒప్పుకోలేదని, దాంతో ఇద్దరం గొడవ పడ్డామని, చివరికి అయన కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చిందని అన్నారు

New Update
Sukumar : ఆ సినిమా రిలీజ్ టైమ్ లో దిల్ రాజు కాళ్ళు పట్టుకున్న సుకుమార్.. అసలేం జరిగిందంటే?

Sukumar Fight With Dil Raju : 'ఆర్య' సినిమా అల్లు అర్జున్, సుకుమార్ కెరీర్స్ కి ఎంత హెల్ప్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దిల్ రాజు వల్లే ఈ కాంబినేషన్ సెట్ అయింది. ఇదే విషయాన్ని సుకుమార్ తాజాగా జరిగిన 'ఆర్య' 20 ఇయర్స్ సెలెబ్రేషన్స్ లో చెప్పాడు. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో దిల్ రాజు, తన మధ్య జరిగిన గొడవ గురించి వివరించారు.

దిల్ రాజు కాళ్ళు పట్టుకున్న సుకుమార్

'ఆర్య' 20 ఇయర్స్ ఈవెంట్ లో దిల్ రాజుతో తనకు జరిగిన గొడవ గురించి సుకుమార్ మాట్లాడుతూ.." ఆర్య షూటింగ్ అంతా కంప్లీట్ అయి.. రిలీజ్ కి ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది. ఓ వైపు డబ్బింగ్, మిక్సింగ్ పనులు జరుగుతున్నాయి. అలంటి టైం , మాంటేజ్ సాంగ్ తీయాలని దిల్ రాజుతో చెప్పాను .

Also Read : పవన్ ప్లేస్ లో ఎన్టీఆర్.. సెప్టెంబర్లోనే ‘దేవర’ సందడి!

సినిమా అంతా అయిపోయాక మళ్ళీ షూటింగ్ ఏంటని ఆయన ఒప్పుకోలేదు. సినిమాలో అది ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పినా కూడా బడ్జెట్ పెరిగిపోతుందని వద్దని అన్నారు. ఆ టైం లో ఇద్దరం తగ్గలేదు. మాటా మాటా పెరిగి మీరు అనే దగ్గరి నుంచి నువ్వు అనే వరకు వెళ్ళింది.

గొడవ ఇంకా పెద్దగా అవుతుందనే టైం లో దిల్ రాజు కాళ్ళు పట్టుకున్నా. ఆర్య లో ఆ పోర్షన్ సినిమాకి ప్రాణం లాంటిది, దయచేసి ఒక్క రోజు షూటింగ్ కి పర్మిషన్ ఇవ్వండి అని ప్రాధేయపడ్డాను. చివరికి అయన ఓకే అని చెప్పడంతో రిలీజ్ కి సరిగ్గా మూడు రోజుల ముందే మాంటేజ్ సాంగ్ షూట్ చేశాం" అని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు