Sukesh : జాక్వెలిన్ కు జైలు నుంచే ప్రేమలేఖ రాసిన సుకేశ్...100 మందికి ఆ బహుమతులు ఇస్తాడంట! మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ జైలు నుంచి మరోసారి బాలీవుడ్ నటి జాక్వెలిన్ కి ప్రేమలేఖను రాశాడు.ఆగస్టు 11న జాక్వెలిన్ పుట్టిన రోజు సందర్భంగా వంద మందికి ఐఫోన్ 15ప్రో ను బహుమతిగా ఇవ్వనున్నట్లు సుకేశ్ ప్రకటించాడు. By Bhavana 12 Jul 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Sukesh Chandra Shekar : మనీలాండరింగ్ కేసు (Money Laundering Case) లో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ జైలు నుంచి మరోసారి బాలీవుడ్ (Bollywood) నటి జాక్వెలిన్ కి ప్రేమలేఖను రాశాడు. గతంలో కూడా జాక్వెలిన్ (Jacqueline Fernandez) కు సుకేశ్ ప్రేమలేఖలు పంపిన విషయం తెలిసిందే. ఆగస్టు 11న జాక్వెలిన్ పుట్టిన రోజు సందర్భంగా వంద మందికి ఐఫోన్ 15ప్రో ను బహుమతిగా ఇవ్వనున్నట్లు సుకేశ్ ప్రకటించాడు. ఇటీవల శ్రీలంకన్ బ్యూటీ కొత్తపాట ‘యిమ్మీ యిమ్మీ’ పాట బాగుందంటూ లేఖలో అభినందించాడు. తన లాయర్ ద్వారా సుకేశ్ మీడియాకు లేఖను విడుదల చేశాడు. తాను ఆ పాటను చాలాసార్లు చూశానని.. దాంతో వంద మందికి ఐఫోన్ 15 ప్రో కానుకగా ఇవ్వనున్నట్లు తెలిపాడు. సుకేశ్ పంపిన ఆ లేఖలో ఆమె అందం గురించి పొగడ్తల వర్షం కురిపించాడు. సాంగ్ వంద మిలియన్ల వ్యూస్‌ను దాటిందని.. జాక్వెలిన్ బాలీవుడ్‌కి నిజమైన క్వీన్ అంటూ లేఖలో పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. రూ.200కోట్ల కుంభకోణం కేసులో ఈడీ (ED) ఇటీవల జాక్వెలిన్ కి సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. కేసులో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలుసార్లు ఈడీ విచారించింది. ఈ కేసులో జాక్వెలిన్‌ను నిందితురాలిగా పేర్కొన్నా.. ఈడీ అరెస్టు చేయలేదు. 2022 నవంబర్ 15న కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మనీలాండరింగ్ కేసులో లంకన్ బ్యూటీని ఈడీ పలుమార్లు విచారించడంతో పాటు పలు ఆస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ నుంచి రూ.7 కోట్లకుపైగా విలువైన ఆభరణాలు, వస్తువులను బహుమతిగా జాక్వెలిన్ తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఆమెతో పాటు కుటుంబీకులకు అనేక అత్యాధునిక కార్లు, ఖరీదైన బ్యాగులు, బట్టలు, బూట్లు, ఖరీదైన వాచ్‌లను బహుమతిగా ఇచ్చినట్లు ఈడీ ఆరోపించింది. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను జాక్వెలిన్ ఖండించింది. సుకేశ్ తనను మోసం చేసినట్లుగా పేర్కొంది. Also read: గురుకుల హాస్టల్ లో విద్యార్థినులను కొరికిన ఎలుకలు! #bollywood #jacqueline-fernandez #sukesh-chandra-shekar #ed #money-laundering-case సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి