ప్రపంచంలో ఆసక్తికరమైన గ్రామం!

ప్రపంచంలో మనకు తెలియని అనేక ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా తెలుస్తాయి. బ్రిటన్‌లోని కొన్ని ప్రాంతాల నుండి పదవీ విరమణ పొందిన వ్యక్తులు తమకంటూ ఒక ప్రత్యేకమైన గ్రామాన్ని సృష్టించి, అందులో సంతోషంగా జీవిస్తున్నారు. అదే ఇప్పుడు మనం చూడబోతున్నాం.

New Update
ప్రపంచంలో ఆసక్తికరమైన గ్రామం!

Britain Cannock Mill: బ్రిటన్‌లో కానాక్ మిల్ అనే గ్రామం ఉంది. ఆర్కిటెక్ట్ ఆన్ థోర్న్, స్నేహితుల బృందం ఈ 2.5 ఎకరాల పర్యావరణ గ్రామాన్ని రూపొందించారు. ఆన్ థోర్న్ లండన్ జీవనశైలితో విసిగిపోయానని, పదవీ విరమణ తర్వాత అందరూ ప్రశాంతంగా జీవించగలిగే స్థలాన్ని సృష్టించాలని అనుకున్నానని తెలిపింది.

Britain Cannock Mill

2006వ సంవత్సరంలో ఒకరోజు తన స్నేహితులతో కూర్చొని పెద్దలు, పిల్లలు, స్త్రీలు, పురుషులు ఇలా అందరూ కలిసి జీవించే ప్రదేశాన్ని ఎందుకు సృష్టించకూడదని ఆలోచించామన్నారు. ఒంటరితనం ఉండకూడదని భావించి ఈ విశిష్ట గ్రామానికి ఇక్కడి నుంచే పునాది వేశామన్నారు. గార్డియన్ నివేదించినట్లుగా, గ్రామాన్ని స్థాపించడానికి ఆన్ థోర్న్ కు 13 సంవత్సరాలు పట్టింది.

Britain Cannock Mill

అంతకుముందు, 2006లో, ఆమె స్నేహితులందరూ పదవీ విరమణ పొంది, అందరూ వారి సొంత ఇళ్లకు వెళ్ళినప్పుడు, ఆన్ థోర్న్ ఒంటరిగా భావించడం ప్రారంభించింది. ఆపై ఆన్ అందర్నీ కలసి 1.2 మిలియన్ డాలర్లకు భూమిని కొనుగోలు చేసింది. అప్పట్లో 8 కుటుంబాలు మాత్రమే ఉండడంతో పింఛను మొత్తం దీనికే వెచ్చించేవారు. ఇప్పుడు ఇది చాలా మంది ప్రజలు వారి మొత్తం కుటుంబాలతో నివసించే గ్రామంగా ఏర్పడింది.

ఇక్కడ నివసించే వారందరూ కలిసి వంటలు చేస్తారు. అందరూ కలిసి కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఏమీ చెల్లించకుండా ఒకరికొకరు బోధిస్తారు. వారంలో నాలుగు రోజులు ఊరంతా కలిసి, కబుర్లు చెప్పుకుంటూ, తిని ఆనందిస్తారు. వారు కలిసి ఆహారాన్ని వండుతారు. అందరూ కలిసి డ్యాన్స్ చేస్తూ పాటలు వింటారు అని వారు చెబుతున్నారు.

తేనెటీగల పెంపకం, కుండల తయారీ ఇక్కడి ప్రజల వృత్తులు. అందులో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త పని చేస్తూనే ఉంటారు. ఇక్కడ స్థిరపడిన ప్రతి ఇల్లు స్వయం సమృద్ధిగా ఉంటుంది. అవసరమైనప్పుడు ఒకరికొకరు మద్దతిస్తాం అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు