Basara IIIT: ఇంకా రిలీజ్‌కాని బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ నోటిఫికేషన్‌.. ఆందోళనలో విద్యార్థులు

తెలంగాణలో రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (బాసట ట్రిపుల్‌ ఐటీ)లో అడ్మిషన్ నోటిఫికేషన్ ఇంకా విడుదల చేయలేదు. టెన్త్ రిజల్ట్స్‌ వచ్చి మూడు వారాలైనా ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

New Update
Basara IIIT: ఇంకా రిలీజ్‌కాని బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ నోటిఫికేషన్‌.. ఆందోళనలో విద్యార్థులు

తెలంగాణలో రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (బాసట ట్రిపుల్‌ ఐటీ)లో అడ్మిషన్ల కోసం టెన్త్ పాసైన మెరిట్ స్టూడింట్లు ఇంకా ఎదురుచూస్తున్నారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలై సుమారు మూడు వారాలైనా కూడా.. ఇంకా ఆర్జీయూకేటీలో అడ్మిషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారని ఎదురుచూస్తున్నారు.

Also read: మల్కాజ్ గిరిలో నా గెలుపు పక్కా: ఈటల-LIVE

ఇదిలాఉండగా 2008లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి.. గ్రామీణ ప్రాంత మెరిట్‌ విద్యార్థులకు నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అందించేందుకు బాసరలో ఆర్జీయుడేటీని ఏర్పాటు చేశారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ యూనివర్సిటీలో చదువుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఇందులో సీటు సాధించిన విద్యార్థులు రెండేళ్లు పీయూసీ (ఇంటర్‌)తో పాటు నాలుగేళ్లు ఇంజినీరింగ్ కోర్సు చేయాల్సి ఉంటుంది. ఏటా ఇక్కడ 1500 సీట్లు భర్తీ చేస్తున్నారు.

ఆర్జీయూకేటీ అడ్మిషన్ నోటిఫికేషన్ సకాలంలో రిలీజ్ చేయకపోతే.. అకాడమిక్ ఇయర్ ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. అయితే రాష్ట్రంలో బాసర ట్రిపుల్‌ఐటీతో పాటు మరో రెండు ఆఫ్‌ క్యాంపస్‌లు పెట్టాలని సర్కార్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు విద్యార్థులు, పేరెంట్స్.. అడ్మిషన్ షెడ్యూల్‌ త్వరగా విడుదల చేయాలని కోరుతున్నారు.

Also read: కోవాక్సిన్ తీసుకోవటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు..ICMR

Advertisment
Advertisment
తాజా కథనాలు