Stock Market: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి.ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో 3,895కి పెరిగింది. నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయి 22,442 వద్ద స్థిరపడింది. 

New Update
Stock Market: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా లాభాలను కోల్పోతూ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఒడిదుడుకుల మధ్య కొనసాగుతూ చివరకు ఫ్లాట్ గా ముగిశాయి. ప్రధానంగా బ్యాంకింగ్ రంగ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో 3,895కి పెరిగింది. నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయి 22,442 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కోటక్ బ్యాంక్ (5.01%), టీసీఎస్ (2.13%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.80%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.47%), సన్ ఫార్మా (1.40%).

టాప్ లూజర్స్:
టైటాన్ (-7.18%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.86%), ఎన్టీపీసీ (-2.31%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.22%), ఎల్ అండ్ టీ (-1.06%)

Advertisment
Advertisment
తాజా కథనాలు