Stock Market Trends: వరుసగా నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. ఈరోజు పరిస్థితి ఏమిటి? నిపుణులు ఏమంటున్నారు? ఈ వారంలో వరుసగా ఐదు సెషన్స్ నుండి స్టాక్ మార్కెట్ నష్టాలను నమోదు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో వారం చివరి ట్రేడింగ్ రోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండవచ్చు? నిపుణులు ఏమంటున్నారు? తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి. By KVD Varma 10 May 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Stock Market Trends: బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్లు గురువారం వరుసగా ఐదవ సెషన్‌లో క్షీణతను నమోదు చేశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) 345 పాయింట్లు పతనమై 22,000 మార్కు దిగువకు పడిపోయింది. ఇదే సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1062 పాయింట్లు పతనమై 72,404 పాయింట్లకు చేరుకుంది. ఈక్రమంలో వారం చివరి ట్రేడింగ్ రోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది అనే విషయంలో నిపుణులు పెద్దగా ఆశావహ సంకేతాలు ఇవ్వడం లేదు. గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగానే మన మార్కెట్లు కూడా కదులుతున్నందున ప్రస్తుతం భారీ కరెక్షన్ తీసుకునే అవకాశం కానీ, పుంజుకునే ఛాన్స్ గానీ కనిపించడం లేదని నిపుణులు భావిస్తున్నారు. Stock Market Trends: భారత స్టాక్ మార్కెట్ క్రాష్ గురించి ప్రభుదాస్ లిల్లాధర్ టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ వైశాలి పరేఖ్ జాతీయ బిజినెస్ వెబ్సైట్ మింట్ తో చెప్పిన దానిప్రకారం.. నిఫ్టీ 50 ఇండెక్స్‌కు 22,000 మార్కు వద్ద మద్దతు ఉంది. ఈ క్షీణత ఇలాగే కొనసాగితే.. కీలక మద్దతు 21,750గా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇక వైశాలి పరేఖ్ ఈరోజు మూడు స్టాక్‌లను కొనుగోలు/అమ్మాలని సిఫార్సు చేశారు. మొదటిది ఇండస్‌ఇండ్ బ్యాంక్, రెండవది అజంతా ఫార్మా, మూడవది సన్ టీవీ వైశాలి పరేఖ్ ఇంట్రాడే స్టాక్‌ల కొనుగోలు/అమ్మకం సిఫార్సు 1) ఇండస్ఇండ్ బ్యాంక్: అమ్మకపు ధర : రూ .1,401.45, టార్గెట్ : రూ. 1355, స్టాప్ లాస్ : రూ. 1430 2) అజంతా ఫార్మా: కొనుగోలు ధర: రూ. 2,409, టార్గెట్ : రూ. 2,510, స్టాప్ లాస్: రూ. 2,360 Stock Market Trends: ఛాయిస్ బ్రోకింగ్‌కు చెందిన సుమీత్ బగాడియా మింట్ తో పంచుకున్న అభిప్రాయాల ప్రకారం.. కొన్ని స్టాక్‌లు ఇప్పటికీ చార్ట్ ప్యాటర్న్‌లో పటిష్టంగా కనిపిస్తున్నందున స్టాక్ స్పెసిఫిక్ అప్రోచ్‌ను అనుసరించాలి. . గత ఐదు వరుస సెషన్లలో భారీ అమ్మకాలు జరిగినప్పటికీ, టాటా మోటార్స్ , హీరో మోటోకార్ప్ , జెడబ్ల్యుఎల్, ఆర్టెమిస్ మెడికేర్ సర్వీసెస్ మరియు ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ టెక్నికల్ బ్రేక్‌అవుట్ ఇచ్చాయని అంటున్నారు. పెరిగిన వాల్యూమ్‌తో ప్రతిఘటన స్థాయి. ఈ స్టాక్‌లను ఈరోజే కొనుగోలు చేయాలని ఆయన సూచిస్తున్నారు. Also Read: ఒక్కరోజులోనే స్టాక్ మార్కెట్లో రూ.7.3 లక్షల కోట్ల నష్టం.. Stock Market Trends: ఇక భారతీయ స్టాక్ మార్కెట్ కోసం సుమీత్ బగాడియా ఆశాజనకమైన దృక్పథాన్ని వ్యక్తం చేస్తున్నారు. "నిఫ్టీ 50 ఇండెక్స్ కీలకమైన 22,000 మద్దతు కంటే దిగువకు పడిపోయింది. 50-స్టాక్ ఇండెక్స్ ఇప్పుడు 21,800 నుండి 21,750 స్థాయికి కీలకమైన మద్దతును కలిగి ఉంది. ఉదయం సెషన్‌లో ఈ మద్దతు అలాగే ఉంటే, తరువాతి సెషన్స్ లో దలాల్ స్ట్రీట్ లో ఉపశమన ర్యాలీ ఊహించవచ్చు” అని సునీత్ బగాడియా అంటున్నారు. సురేష్ బాగాడియా ఈరోజు కొనుగోలు చేయవచ్చని రికమండ్ చేస్తున్న స్టాక్స్ ఇవే.. 1> టాటా మోటార్స్: ₹ 1030 వద్ద కొనండి , లక్ష్యం ₹ 1124, స్టాప్ లాస్ ₹ 982; 2> హీరో మోటోకార్ప్: ₹ 4765 వద్ద కొనండి , లక్ష్యం ₹ 5090, స్టాప్ లాస్ ₹ 4580; 3> JWL: ₹ 420.25 వద్ద కొనండి , లక్ష్యం ₹ 460, స్టాప్ లాస్ ₹ 405; 4> ఆర్టెమిస్ మెడికేర్ సర్వీసెస్: ₹ 190.35 వద్ద కొనండి , లక్ష్యం ₹ 206, స్టాప్ లాస్ ₹ 182.50; 5> ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్: ₹ 1956 వద్ద కొనండి , లక్ష్యం ₹ 2055, స్టాప్ లాస్ ₹ 1880. గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. స్థానికంగా ఉన్న మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది. #stock-market-review #stock-market-trends మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి