Stock Market News: కాస్త పైకెగసిన మార్కెట్లు.. అయినా నష్టాల్లో చాలా స్టాక్స్.. టాప్ లూజర్స్ ఎవరంటే.. నిన్న (జనవరి 04) స్టాక్ మార్కెట్ లో కాస్త పెరుగుదల కనిపించింది. సెన్సెక్స్ 490 పాయింట్లు పెరిగింది. 71,847 వద్ద ముగిసింది. నిఫ్టీ 141 పాయింట్ల లాభంతో 21,658 వద్ద మార్కెట్ ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 12 మాత్రమే లాభపడగా 18 పతనమయ్యాయి. By KVD Varma 05 Jan 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Stock Market News: మన డబ్బును మరింత పెంచాలంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా గొప్పగా ఉంటాయని ఎక్కువమంది భావిస్తారు. ఈ కారణంతోనే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం కోసం పరుగులు తీస్తూ ఉంటారు. అయితే, స్టాక్ మార్కెట్ అనేది పూర్తి అస్థిరత తో ఉండే ప్రదేశం. ఒక్క నిమిషంలో మన డబ్బు డబుల్ అయిపోవచ్చు.. మరో నిమిషంలోనే ఒక్క రూపాయి మిగలకుండా ఊడ్చుకుపోవచ్చు. అందుకే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే.. జాగ్రత్తగా ఆచి తూచి.. నిపుణుల సలహాలు తీసుకుని.. కొంత రీసెర్చ్ చేసి చేయాల్సి ఉంటుంది. అందుకే, ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ తీరుతెన్నులను(Stock Market News) ప్రతిరోజూ అంచనా వేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజూ మార్కెట్ మొదలయ్యే ముందు నిన్నటి రోజున మార్కెట్ తీరుతెన్నులపై ఒక రివ్యూ చేసుకోవడం అవసరం. అందుకే అంచనాలకు అందకుండా కదిలే స్టాక్ మార్కెట్ నిన్న మార్కెట్ ముగిసే సరికి ఎలా ఉందొ.. టాప్ గెయినర్స్ ఎవరో.. టాప్ లూజర్స్ ఎవరో మీకోసం అందిస్తోంది RTV. ఈరోజు స్టాక్ మార్కెట్ (Stock Market News)ప్రారంభ సమయంలో ఈ విషయాలని ఒకసారి పరిశీలించడం స్టాక్ ఇన్వెస్టర్స్ కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నిన్నటి అంటే గురువారం నాటి స్టాక్ మార్కెట్ కదలికలపై ఓ లుక్కేద్దాం. గత ట్రేడింగ్ సెషన్ లో స్టాక్ మార్కెట్(Stock Market News) కాస్త కిందికి కదలాడిన విషయం తెలిసిందే. అయితే… నిన్న అంటే గురువారం (జనవరి 4) స్టాక్ మార్కెట్‌లో పెరుగుదల కనిపించింది. సెన్సెక్స్ 490 పాయింట్ల లాభంతో 71,847 వద్ద ముగిసింది. ఇదే సమయంలో నిఫ్టీ కూడా 141 పాయింట్లు లాభపడింది. 21,658 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 18 క్షీణించగా, 12 వృద్ధి చెందాయి. పవర్ - మెటల్ షేర్లలో మరింత పెరుగుదల ఉంది. Also Read: ఆర్బీఐ కీలక చర్యలు..ఆ ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ నిబంధన ఎత్తివేత..! రాబోయే త్రైమాసిక ఫలితాలు పెద్దగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం లేదనే అభిప్రాయం మార్కెట్లో(Stock Market News) గట్టిగా ఉందని నిపుణులు అంటున్నారు. ఈమధ్య కాలంలో మార్కెట్ ర్యాలీతో ఇన్వెస్టర్స్ బాగానే లాభాలు సవీకరించారు. దీంతో ఇప్పుడు స్టాక్ మార్కెట్ కదలికల్లో అప్ అండ్ డౌన్స్ ఎక్కువగానే ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం ట్రేడింగ్ సెషన్స్ లో నష్టాలు చూసిన మార్కెట్లు గురువారం కాస్త తేరుకున్నాయని వారంటున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ ఇండెక్స్ రేంజ్ బౌండ్ లో ఉండడం దీనికి కలిసివచ్చింది. సెన్సెక్స్ 30 ఇండెక్స్(Stock Market News) లో బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, నెస్లే, పవర్‌గ్రిడ్, ఇన్పోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభాలు మూటగట్టుకోగా.. హెచ్‌సీఎల్ టెక్, ఎం అండ్ ఎం, మారుతిసుజుకీ, హెచ్‌యూఎల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, విప్రో నష్టాలను చూశాయి. మొత్తంగా చూసుకుంటే.. బుధవారం ఎఫ్ఐఐలు (ఫారిన్ ఇన్వెస్టర్స్) 666.34 కోట్ల రూపాయల విలువ చేసే షేర్లను అమ్మేశారు. గమనిక: ఇక్కడ ఇచ్చిన వివరాలు స్టాక్ మార్కెట్(Stock Market News) కదలికల ఆధారంగా ఇచ్చినవి. ఇవి కేవలం ఇన్వెస్టర్స్ అవగాహన కోసం ఇచ్చినవి తప్ప.. RTV ఎటువంటి షేర్లు కొనమని కానీ, అమ్మమని కానీ చెప్పడం లేదు. వాటి లాభ నష్టాల విషయంలో RTVకి ఎటువంటి సంబంధమూ లేదు. ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెట్టే ముందు పర్సనల్ ఫైనాన్స్ సలహాదారుల సలహాలు తీసుకోవలసిందిగా సూచిస్తున్నాం. Watch this interesting Video: #stock-market #stock-market-today మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి