Satya Nadella: రాత్రంతా మేల్కొని మరీ మ్యాచ్‌ ని ఎంజాయ్‌ చేశా

వాఖండే స్టేడియంలో జరిగిన భారత్‌- న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ ని కేవలం అభిమానులు , ప్రజలు మాత్రమే కాకుండా ప్రముఖులు కూడా టీవీలకు అతుక్కుపోయినట్లు తెలుస్తుంది. వారిలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఒకరు. ఆయనే స్వయంగా రాత్రంతా మేల్కొని మరీ మ్యాచ్‌ ని ఎంజాయ్‌ చేసినట్లు తెలిపారు.

New Update
Satya Nadella: రాత్రంతా మేల్కొని మరీ మ్యాచ్‌ ని ఎంజాయ్‌ చేశా

Satya Nadella: వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్ తో బుధవారం జరిగిన సెమీ ఫైనల్‌ (India Vs New Zealand) పోరులో టీమ్‌ ఇండియా 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ విన్నింగ్ ని కేవలం భారత్ లో ఉన్నవారు మాత్రమే కాదు విదేశాల్లో ఉన్న వారు కూడా ఎంతో ఎంజాయ్ చేశారు.చేస్తున్నారు కూడా.

భారత్‌ సాధించిన విజయాన్ని ప్రజలు రాత్రి తెల్లవార్లు జరుపుకున్నారు. సంబరాల్లో మునిగి తేలారు. ఎందరో ప్రజలు టీవీలకు అతుక్కుపోయి మరీ మ్యాచ్‌ ని తిలకించారు. కేవలం సామాన్యులు, క్రికెట్‌ అభిమానులు మాత్రమే కాదు..ప్రముఖులు కూడా టీవీలకు కళ్లు అప్పగించినట్లు తెలిపారు.

వారిలో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఒకరు. ఆయన కూడా రాత్రంతా మేల్కొని మరీ ఈ మ్యాచ్‌ ను ఎంతో ఆసక్తిగా తిలకించారు. స్వయంగా ఆయనే ఈ విషయం గురించి తెలిపారు. ఆయన బుధవారం నాడు సియాటెల్‌ లో మైక్రోసాఫ్ట్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌ లో ఉపన్యాసం ఇచ్చిన తరువాత రాత్రంతా మేల్కొని మరీ భారత్‌- న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్ ను చూసినట్లు తెలిపారు.


ఇగ్నైట్‌ పేరిట సియాటెల్ లో మైక్రోసాఫ్ట్‌ (Microsoft) డెవలపర్‌ కాన్ఫరెన్స్‌ ను షెడ్యూల్ చేసిన రోజే వరల్డ్‌ కప్‌ (World Cup 2023) సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుందని మాకు నిజంగా తెలియదు. అక్కడ ఉపవాసం ఇచ్చి వచ్చి నైట్‌ మొత్తం మ్యాచ్‌ లో మునిగిపోయా. రాత్రి మొత్తం మేల్కొనే ఉన్నా..భారత్ విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు.

క్రికెట్‌ అభిమానులకు మంచి మజాను పంచింది సెమీస్‌ మ్యాచ్‌. కివీస్‌, టీమిండియా మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ అద్భుత విజయం సాధించింది. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై గెలుపుతో రోహిత్‌ సేన ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఇక నవంబర్‌ 16న ఆస్ట్రేలియా వర్సెస్‌ దక్షిణాఫ్రికా మ్యాచ్‌ రెండో సెమీస్‌ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఇండియా తలపడనుంది.

నవంబర్‌ 19(ఆదివారం) అహ్మదాబాద్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ గెలుపుతో 2019 వరల్డ్ కప్‌ సెమీస్‌లో ఎదురైన పరాభవానికి టీమిండియా బదులు తీర్చుకుంది. 2019 ప్రపంచకప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలోనే ఇండియా ఓడిపోయిన విషయం తెలిసింది. స్టార్‌ పేసర్‌ షమీ మరోసారి భారత్‌ను గెలిపించాడు. బంతితో నిప్పులు చెరిగాడు. ఏడు వికెట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో ప్రపంచ కప్ హిస్టరీలో నాలుగో సారి ఫైనల్ కు చేరిన జట్టుగా ఇండియా నిలిచింది.

కాగా, చరిత్రాత్మక వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన సెమీఫైనల్‌ పోరులో టీమ్‌ఇండియా 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. విరాట్‌ కోహ్లీ (113 బంతుల్లో 117, 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత సెంచరీకి తోడు శ్రేయస్‌ అయ్యర్‌ (70 బంతుల్లో 105, 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో భారత్‌ 397/4 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్యఛేదనలో మహమ్మద్‌ షమీ (7/57) బౌలింగ్‌ విజృంభణతో కివీస్‌ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. ఓవరాల్‌గా మెగాటోర్నీలో నాలుగోసారి టైటిల్‌ పోరుకు అర్హత సాధించిన భారత్‌ ముచ్చటగా మూడోసారి కప్‌ను ముద్దాడేందుకు మరో అడుగుదూరంలో ఉంది.

Also read: చేసిందేమి లేదంటూ.. మా ప్రెసిడెంట్ పై ప్రకాష్‌ రాజ్‌ ఫైర్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు