SSC Exams: SSC అభ్యర్థులకు అలెర్ట్‌.. CHSL ఎగ్జామ్‌పై కీలక అప్‌డేట్!

SSC టైర్-2 తుది ఆన్సర్‌'కీ'ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఏప్రిల్ 8 వరకు SSC CHSL ఆన్సర్‌ 'కీ'తో ప్రశ్న పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నియామకం కోసం మొత్తం 1,211 మంది అభ్యర్థులు తాత్కాలికంగా షార్ట్‌లిస్ట్ చేసిన విషయం తెలిసిందే.

New Update
AP: నాలుగు రోజుల్లో పది సప్లిమెంటరీ పరీక్షలు..షెడ్యూల్‌ ఇదే!

SSC CHSL: కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (SSC CHSL పరీక్ష 2023)టైర్ 2 తుది సమాధాన'కీ'ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఆన్సర్‌ 'కీ'తో పాటు టైర్ 2 పరీక్ష ప్రశ్నపత్రాన్ని కూడా కమిషన్ అప్‌లోడ్ చేసింది. SSC CHSL టైర్ 2 పరీక్షలో హాజరైన అభ్యర్థులు కమిషన్ కొత్త అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ని విజిట్ చేసి ఆన్సర్‌ 'కీ'తో పాటు ప్రశ్న పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏప్రిల్ 8 వరకు SSC CHSL ఆన్సర్‌ 'కీ'తో ప్రశ్న పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. ఈ గడువు దాటిన తర్వాత వీటికి యాక్సెస్ ఉండదు.

ఓల్డ్‌ SSC వెబ్‌సైట్ ssc.nic.inలో క్వాలిఫైడ్, క్వాలిఫై కాని అభ్యర్థుల మార్కులు కూడా హోస్ట్ చేస్తామని కమిషన్ తెలియజేసింది. అభ్యర్థులు తమ రిజిస్టర్డ్ ID, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయడం ద్వారా ఇవాళ్టి(మార్చి 24) వరకు వారి వ్యక్తిగత మార్కులను చెక్‌ చేసుకోవచ్చు. SSC CHSL ఫలితాలు ఫిబ్రవరిలో ప్రకటించారు. నియామకం కోసం మొత్తం 1,211 మంది అభ్యర్థులు తాత్కాలికంగా షార్ట్‌లిస్ట్ చేశారు.

ఆన్సర్ 'కీ'ని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి:

జవాబు కీని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు దిగువ ఇచ్చిన దశలను అనుసరించవచ్చు:

--> ముందుగా SSC ( ssc.gov.in ) అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.

--> ఫైనల్ ఆన్సర్ కీ లింక్‌పై క్లిక్ చేయండి.

--> స్క్రీన్‌పై PDF డిస్‌ప్లే అవుతుంది.

--> PDFలో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి.

--> రోల్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, లాగిన్‌పై క్లిక్ చేయండి.

--> SSC CHSL ఫైనల్ ఆన్సర్ కీ, ప్రశ్నాపత్రం డిస్‌ప్లే అవుతాయి.

--> ఫ్యూచర్‌ పర్పెస్‌ కోసం ఆన్సర్‌ 'కీ'ని డౌన్‌లోడ్ చేసుకోండి.

Also Read: టెట్ అభ్యర్థులకు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్.. ఉద్యమ బాటలో నిరుద్యోగులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు