SS Thaman : రేపు 'గేమ్ ఛేంజర్' నుండి అప్డేట్.. వైరల్ అవుతున్న థమన్ ట్వీట్

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ 'గేమ్ ఛేంజర్' మూవీపై అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు తన ఎక్స్ లో..' గేమ్ ఛేంజర్.. హ్యాపీ వినాయకచవితి 2024' అంటూ ట్వీట్ చేసాడు. తమన్ ట్వీట్ చూస్తుంటే రేపు సెప్టెంబర్ 7న 'గేమ్ ఛేంజర్' నుంచి టీజర్ లేదా గ్లింప్స్ ఇస్తారని తెలుస్తుంది.

New Update
SS Thaman : రేపు 'గేమ్ ఛేంజర్' నుండి అప్డేట్.. వైరల్ అవుతున్న థమన్ ట్వీట్

SS Thaman : సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'గేమ్ ఛేంజర్'. సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమానుఅగ్ర నిర్మాత దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటించగా.. నటి అంజలి మరో కీలక పాత్ర పోషిస్తుంది.

ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు తన ఎక్స్ లో..' గేమ్ ఛేంజర్.. హ్యాపీ వినాయకచవితి 2024' అంటూ ట్వీట్ చేసాడు.

Also Read : ‘గేమ్ ఛేంజర్’ లో SJ సూర్య పాత్రపై దిల్ రాజు కామెంట్స్..

తమన్ ట్వీట్ చూస్తుంటే వినాయకచవితి అంటే రేపు సెప్టెంబర్ 7న గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇవ్వనున్నారని, ఫ్యాన్స్ అడిగినట్టు టీజర్ లేదా గ్లింప్స్ ఇస్తారని తెలుస్తుంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మెగా ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న విడుదల చేయనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు