Telangana: శ్రీశైలం, నాగార్జునా సాగర్ కు భారీ వరద నీరు..గేట్లు ఎత్తిన అధికారులు

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో శ్రీశైలం జలాశయంలో ఆరు గేట్లను, నాగార్జునా సాగర్ లో 16 గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు.

New Update
Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

SriSailam, Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌ జలాశయానికి నీటి ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్‌కు వరద వస్తోంది. ఒకపక్క నాగార్జునా సాగర్‌‌కు నీటిని పంపిస్తూనే ఉన్నారు. మరోవైపు శ్రీశైలం జలాశయం నిండిపోతూనే ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వస్తూనే ఉంది. దీంతో రెండు డ్యామ్‌లో గేట్లను ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. నాగార్జునా సాగర్‌‌లో అధికారులు డ్యామ్‌ 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయానికి 1,78,983 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో ఉంది. నాగార్జునసాగర్ ప్రస్తుత, పూర్తి నీటిమట్టం 590 అడుగులుగా ఉండగా.. జలాశయం ప్రస్తుత, పూర్తి నీటినిల్వ 312.50 టీఎంసీలుగా ఉంది.

ఇక శ్రీశైలం ది కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 2,86,371 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా...అవుట్ ఫ్లో 2,36,882 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు అయితే జలాశయం ప్రస్తుత నీటిమట్టం 885 అడుగులుగా ఉంది. డ్యామ్‌లో పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు అయితే ప్రస్తుత నీటి నిల్వ 215.8070 టీఎంసీలు నిండిపోయాయి. మరోవైపు శ్రీశైలం జలాశయం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ముమ్మరంగా కొనసాగుతోంది.

Also Read: Jammu-kashmir: పూంచ్‌లో చైనా గ్రెనేడ్లు..స్వాధీనం చేసుకున్న భారత ఆర్మీ

Advertisment
Advertisment
తాజా కథనాలు