Sreeleela: తండ్రి వయసున్న వ్యక్తితో శ్రీలీల సరసాలు.. ఇండస్ట్రీలో గుసగుసలు!

యంగ్ బ్యూటీ శ్రీలీల మరో సీనియర్ హీరోతో నటించే చాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో అజిత్ నెక్ట్స్ మూవీలో హీరోయిన్ గా సెలక్ట్ అయినట్లు సమాచారం. దీంతో తండ్రి వయసున్న వ్యక్తితో సరసాలు చూడలేమంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

New Update
Sreeleela: తండ్రి వయసున్న వ్యక్తితో శ్రీలీల సరసాలు.. ఇండస్ట్రీలో గుసగుసలు!

Sreeleela to Art with Hero Ajith: సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే కెరటంలా ఎగసిపడింది శ్రీలీల. ‘పెళ్ళిసందడి’ లాంటి చిన్న సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఆమె తన నటనతో మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో తనకు వరుస అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే రెండో సినిమా ‘ధమాకా’ బ్లాక్‌బస్టర్ కావడంతో ఆమె రేంజే మారిపోయింది.

చూడటానికి  క్యూట్‌గా అనిపించినా..
ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) చేసే అవకాశం దక్కించుకుంది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. మహేష్ తో సినిమా ఆమెకు కలిసిరాలేదు. ఈ సినిమాలో శ్రీలీల పాత్ర, నటన తేలిపోయాయి. సినిమా కూడా సరిగా ఆడలేదు. అంతకంటే ముందు స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ లాంటి డిజాస్టర్లు ఖాతాలో వేసుకుంది శ్రీలీల. చూడటానికి క్యూట్‌గా అనిపించినా.. తాను పోషించే పాత్రలకు తగ్గ వెయిట్ తీసుకురాలేకపోవడం, హీరోల పక్కన మరీ చిన్నపిల్లలా అనిపిస్తుండటం, వాయిస్ కూడా మైనస్ కావడంతో శ్రీలీల (Sreeleela) పట్ల ప్రేక్షకుల్లో క్రమంగా నెగెటివిటీ వచ్చేసింది.

ఇది కూడా చదవండి: TS BJP: పార్లమెంట్ ఎన్నికల వేళ.. బీజేపీకి రాజాసింగ్ బిగ్ షాక్!

ఒక్కసారిగా ఊపు తగ్గిపోయింది..
దీంతో ఒక్కసారిగా శ్రీలీల ఊపు తగ్గిపోయింది. మధ్యలో ఆగిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మినహా తెలుగులో ఆమెకు ఛాన్సులు లేవు. ఇలాంటి టైంలో ఆమెకు తమిళంలో ఓ బంపరాఫర్ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు తమిళ సీనియర్ హీరో అజిత్ కుమార్ సరసన శ్రీలీల నటించబోతున్నట్ల వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘విడా ముయర్చి’ అనే యాక్షన్ మూవీ చేస్తున్న అజిత్ (Ajith Kumar) .. దీని తర్వాత తన వీరాభిమాని అయిన ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఓ మూవీ ఓకే చేశాడు. అందులో శ్రీలీలను హీరోయిన్ గా సెలక్ట్ చేస్తున్నారట. ఐతే మహేష్ బాబు పక్కనే శ్రీలీల చిన్న పిల్లలా కనిపించింది. అలాంటిది అజిత్ పక్కన అంటే ఆమెను చూడలేమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అజిత్ తెల్ల జుట్టుతో, భారీ అవతారంతో సినిమాలు చేసేస్తుంటాడు. ఆయన పక్కన అనుభవం ఉన్న హీరోయిన్లే సూట్ కాని పరిస్థితి. అలాంటిది శ్రీలీల జోడీగా నటిస్తే చూడటానికి బావుండేదని విశ్లేషకుల అభిప్రాయం. మొత్తానికి దీనిపై క్లారిటీ వచ్చేవరకూ వెయిట్ చేయాల్సిందే.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Raashii Khanna: రెడ్ బికినీలో రాశి గ్లామర్ షో.. నెట్టింట ఫొటోలు వైరల్

నటి రాశి ఖన్నా లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. రెడ్ స్విమ్ సూట్ లో రాశి హాట్ ఫోజులు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు చూశారా..?

New Update
Advertisment
Advertisment
Advertisment