Breaking : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి శ్రీకాంతాచారి తల్లి!

తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారు. ఇన్నాళ్లుగా బీఆర్ఎస్ లో ఉన్న శంకరమ్మను ఏఐసీసీ తెలంగాణ ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్సీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పీ పార్టీలోకి ఆహ్వానించారు.

New Update
Breaking : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి శ్రీకాంతాచారి తల్లి!

Telangana : తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి(Srikanthachari) తల్లి శంకరమ్మ కాంగ్రెస్(Congress) లో చేరారు. ఇన్నాళ్లుగా బీఆర్ఎస్(BRS) లో ఉన్న శంకరమ్మను ఏఐసీసీ తెలంగాణ ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్సీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పీ పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే శంకరమ్మ ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ని కలిసిన విషయం తెలిసిందే. అయితే శంకరమ్మకు రేవంత్ సర్కార్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నట్లు సన్నిహిత వర్గాల్లో చర్చనడుస్తోంది.

భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని..
ఇక లోక్ సభ ఎన్నికల వేళ తనకు భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్ఠానానికి శంకరమ్మ విజ్ఞప్తి చేశారు. అయితే కేసీఆర్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఏ పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తాని ఆమె వెల్లడించారు. అన్ని పార్టీలు తనపై అభ్యర్థులను ప్రకటించకుండా మద్దతు ఇవ్వాలని కోరారు. ఇదే తెలంగాణ అమరవీరులకు ఇచ్చే గౌరవమని శంకరమ్మ చెప్పుకొచ్చారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె జనవరిలో రేవంత్ రెడ్డిని కలిసి తన బాధలను విన్నవించుకున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేశారు.

ఇది కూడా చదవండి: Crime News: కడపలో దారుణం.. మైనర్ బాలికపై వైసీపీ నేత లైంగిక వేధింపులు..!

సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకే..
ఈ మేరకు శంకరమ్మ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో తనకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేశానని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మెజారిటీ లోక్‌స‌భ‌ స్థానాలు గెలవడం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. ఇక దీనిపై మాట్లాడిన ఉత్తమ్ కుమార్.. శంకరమ్మ కుటుంబం రాష్ట్రానికి చేసిన త్యాగం కాంగ్రెస్ పార్టీ మరవదని, ఆమెకు పార్టీలో అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన వందలాది మంది బీఆర్ఎస్ ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పారు. తమ పార్టీలో చేరడానికి ఉత్సాహంగా ఉన్న నేతలను చేర్చుకోవాలని ఏఐసీసీ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు