Telangana: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద.. 40 గేట్లు ఎత్తివేత

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు 40 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరిసర ప్రాంతాలకు సూచించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా.. 72.99 టీఎంసీలకు చేరింది.

New Update
Telangana: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద.. 40 గేట్లు ఎత్తివేత

తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. చెరువులు నిండు కుండలా మారుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ రాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు 40 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరిసర ప్రాంతాలకు సూచించారు. అలాగే శ్రీరాంసాగర్‌లో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను హెచ్చరించారు.

Also Read: వరదబీభత్సం.. ఆనవాళ్లు కోల్పోయిన రోడ్డు-VIDEO

ఇదిలాఉండగా.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్రో 2 లక్ష 4 వేల 17 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ ఫ్లో 2 లక్షల 15వేల 853 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా.. 72.99 టీఎంసీలకు చేరింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు