Telangana: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద.. 40 గేట్లు ఎత్తివేత
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు 40 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరిసర ప్రాంతాలకు సూచించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా.. 72.99 టీఎంసీలకు చేరింది.