/rtv/media/media_files/2025/03/08/7KanqL6FXSOv1OtsJTB0.jpg)
వరంగల్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సంగెం మండలం తీగరాజుపల్లిలోని ఎస్సారెస్పీ కాలువలో ఓ కారు బోల్తా పడింది. దీంతో ఈ ఘటనలో ఓకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. ఇందులో బాలుడు మృతి చెందగా.. కారుతో పాటుగా తండ్రి, కూతుళ్ల ఆచూకీ లభించలేదు. మహిళను స్థానికులు కాపాడారు. మిగిలిన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
Also read : సికింద్రాబాద్‌లో సైకో యువతి.. లవర్ కోసం తల్లి, అక్కను అతి దారుణంగా చంపి..!
Also Read : ఎలన్ మస్క్‌ను రంగంలోకి దింపిన ట్రంప్.. సునీతా విలియమ్స్ తీసుకొచ్చే డేట్ ఫిక్స్!
అతివేగమే ప్రమాదానికి కారణం?
బాధితులు పర్వతగిరి మండలం మేతరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ కుటుంబంగా గుర్తించారు. ప్రవీణ్ భార్య కృష్ణవేణి, కుమార్తె చైత్ర సాయి, కుమారుడు ఆర్య వర్ధన్ కారులో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణం అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : కాలిఫోర్నియా గవర్నర్ రేసులో యూఎస్ మాజీ ఉపాధ్యక్షురాలు కమలా
Also read : ఏడాదిలోపు చిన్నారుల్లో శ్వాసకోస సమస్యలు..ఎందుకిలా?