RaviTeja : మరోసారి రవితేజకు జోడీగా శ్రీలీల.. 'ధమాకా' మ్యాజిక్ రిపీట్ అయ్యేనా?

రవితేజ తన 75 వ సినిమాని ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీలను సెలెక్ట్ చేసినట్టు తాజా సమాచారం బయటికొచ్చింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

New Update
RaviTeja : మరోసారి రవితేజకు జోడీగా శ్రీలీల.. 'ధమాకా' మ్యాజిక్ రిపీట్ అయ్యేనా?

Sreeleela Pairs With Raviteja : టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల మరోసారి రవితేజతో జోడి కట్టబోతుందట. ధమాకా మూవీలో రవితేజ, శ్రీలీల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.సినిమాలో ఈ ఇద్దరి జోడి ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కానుంది.

వివరాల్లోకి వెళ్తే.. రవితేజ తన 75 వ సినిమాని ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. డెబ్యూ డైరెక్టర్ భాను భోగవరపు తెరకెక్కించనున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే నెల నుంచే సెట్స్ పైకి వెళ్లనుంది.

Also Read : మెగాస్టార్ కి మరో అరుదైన గౌరవం!

ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ నటీ నటులను ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే ఈ సినిమాలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీలను సెలెక్ట్ చేసినట్టు తాజా సమాచారం బయటికొచ్చింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

త్వరలోనే దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి నటించిన ధమాకా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ జోడి కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు