Joe Root : ఒకేఒక్కడు..చరిత్ర సృష్టించిన జో రూట్!
ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 6000 పరుగులు చేసిన మొదటి క్రికెటర్ గా నిలిచాడు. 69 మ్యాచ్ లలో జో రూట్ ఈ ఘనత సాధించాడు.
ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 6000 పరుగులు చేసిన మొదటి క్రికెటర్ గా నిలిచాడు. 69 మ్యాచ్ లలో జో రూట్ ఈ ఘనత సాధించాడు.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. ఈ సిరీస్‌లో మొత్తం 470 బౌండరీలు కొట్టడం ద్వారా 60ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. వీటిలో 422 ఫోర్లు, 48 సిక్సర్లు ఉన్నాయి. అంతకుముందు 1964లో భారత్ ఒక సిరీస్‌లో 384 బౌండరీలు కొట్టింది.
లియోనెల్ మెస్సీ భారత పర్యటన షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది. డిసెంబర్ 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఆయన భారత్‌లో ఉండనున్నారు. ఆయన పర్యటనలో ప్రధానంగా కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ నగరాలు ఉన్నాయి.
కొన్ని వారాల క్రితం విడిపోతున్నట్లు ప్రకటించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ తమ మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. తిరిగా తాము ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని సైనా తెలిపారు.
ఈ సెంచరీతో యశస్వి జైస్వాల్ టెస్టుల్లో ఓపెనర్‌గా ఇంగ్లాండ్‌పై నాలుగు సెంచరీలు చేసిన సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేశాడు. అయితే, జైస్వాల్ ఈ ఘనతను కేవలం 10 మ్యాచ్‌ల్లోనే సాధించడం విశేషం.
లండన్‌లోని ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ 224 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టులో కరుణ్ నాయర్ (52), సాయి సుదర్శన్ (38), వాషింగ్టన్ సుందర్ (25) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు.
ఇంగ్లాండ్ టీమ్ కు బిగ్ షాక్ తగిలింది. భారత్‌తో ఐదో టెస్టులో తొలి రోజు ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడిన క్రిస్ వోక్స్ ఐదో టెస్టు నుంచి వైదొలగాడు. అతడి గాయం తీవ్రంగా ఉండటంతో మ్యాచ్ నుంచి వైదొలగినట్లు ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ ప్రకటించింది.
భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ 47 ఏళ్ల మైలురాయిని బద్దలు కొట్టాడు. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు సునీల్ గావస్కర్ పేరిట ఉంది.
ఐపీఎల్ 2026 కోసం ట్రేడ్ డీల్ ద్వారా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు భారత బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్‌ను కొనుగోలు చేయాలని ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కేఎల్ రాహుల్ కు కెప్టె్న్సీ బాధ్యతలు అప్పగించాలని కేకేఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.