Yashasvi Jaiswal: యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్‌కు తీవ్ర గాయం? సెలక్టర్లకు మరో తలనొప్పి!

యశస్వి జైస్వాల్‌ ఎడమ చీలమండకు తీవ్ర గాయం అయింది. దీంతో సోమవారం జరగనున్న రంజీ ట్రోఫీ సెమీ-ఫైనల్ నుంచి అతడు తప్పుకున్నాడు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం యశస్విని నాన్‌ ట్రావెల్‌ రిజర్వ్‌గా పక్కన పెట్టారు. ఇప్పుడు మరొకరిని తీసుకుంటారా? లేదా? అనేది చూడాలి.

New Update
yashasvi Jaiswal set to miss Ranji semis

yashasvi Jaiswal set to miss Ranji semis

ఇటీవల ప్రారంభమైన రంజీ ట్రోఫీ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. సోమవారం అంటే రేపటి నుంచి సెమీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి. గుజరాత్-కేరళ, విదర్భ - ముంబై మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌ల కోసం ఆయా జట్లు సిద్ధమవుతున్నాయి. 

Also read :  Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా

అయితే ఈ రంజీ సెమీస్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం నాన్ ట్రావెల్ రిజర్వ్‌లో ఉన్న టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కూడా దిగుతాడని వార్తలు జోరుగా సాగాయి. దీంతో అతడి బ్యాటింగ్ చూసేందుకు క్రికెట్ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులు షాక్ అయ్యే వార్త బయటకొచ్చింది. 

Also Read :  Gold Prices: ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.. ఇదే గోల్డెన్‌ ఛాన్స్‌!

జైస్వాల్‌కు తీవ్ర గాయం

జైస్వాల్‌కు తీవ్ర గాయమైంది. అతడికి చీలమండ గాయం కావడంతో సెమీస్‌లో ఆటడం లేదని ముంబై మేనేజ్‌మెంట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌ నుంచి యశస్వి జైస్వాల్ వైదొలిగినట్లు వెల్లడించాయి.

Also Read :  Health: నెలరోజులు క్రమం తప్పకుండ ఈ పండు తింటే...బరువు పెరగరు!

అతడు ఎడమ చీలమండ నొప్పితో బాధపతున్నాడని.. నాగ్‌పూర్‌లోని ముంబై ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు కానీ సౌకర్యంగా అనిపించలేదని తెలిపాయి. ఆ ప్రాక్టీస్ సెషన్‌లో అతడు బ్యాటింగ్ చేస్తూ ఇబ్బంది పడ్డాడని.. సోమవారం సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌కు వెళ్తాడని పేర్కొన్నాయి. ఇక అక్కడే అతడి రికవరీ ప్రాసెస్ స్టార్ట్ కానుందని చెప్పుకొచ్చాయి. 

సెలక్షన్ కమిటీకి తలనొప్పి

దీంతో ఇప్పుడు సెలక్షన్ కమిటీకి మరో తలనొప్పి తలెత్తింది. ఈ గాయం కారణంగా యశస్వి జైస్వాల్ పూర్తిగా దూరమైతే.. అతడి స్థానంలో రిజర్వ్‌గా మరో ప్లేయర్‌ని సెలెక్ట్ చేయాల్సి ఉంది. అయితే మొదట ప్రధాన స్క్వాడ్‌లోనే అవకాశం లభించినప్పటికీ.. వరుణ్‌ చక్రవర్తిని తీసుకొనేందుకు జైస్వాల్‌ను నాన్‌ ట్రావెల్‌ రిజర్వ్‌గా సైడ్‌కి ఉంచారు. మరి ఇప్పుడు ఇంకొకరిని తీసుకుంటారా? లేదా? అనేది చూడాలి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్ ఎంచుకుంది. ఈ టీమ్‌లో స్టార్ ఓపెనర్ ఫాఫ్‌ డుప్లెసిస్‌ తిరిగొచ్చాడు. ఇక ఆర్సీబీ మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

New Update
RCB vs DC

RCB vs DC

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్ ఎంచుకుంది. ఈ టీమ్‌లో స్టార్ ఓపెనర్ ఫాఫ్‌ డుప్లెసిస్‌ తిరిగొచ్చాడు. ఇక ఆర్సీబీ మాత్రం ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగింది. 

Advertisment
Advertisment
Advertisment