/rtv/media/media_files/2025/03/23/wLVobSVuhiWxmXmI2dhI.jpg)
Satyanarayana Raju
ఐపీఎల్లో మరో తెలుగు కుర్రాడు ఎంట్రీ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ తరఫున కాకినాడ జిల్లాకు చెందిన పేసర్ సత్యనారాయణరాజు ఇవాళ డెబ్యూ మ్యాచ్ ఆడుతున్నారు. 25 ఏళ్ల ఈ యువకుడిని ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఇతని తండ్రి రొయ్యల వ్యాపారి. కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన సత్యనారాయణరాజు బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తాడు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ లో రాయలసీమ కింగ్స్ తరుపున ఆడాడు. ఏడు మ్యాచ్‌ల్లో 6.15 ఎకానమీతో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. 2024 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో, రాజు ఆంధ్ర తరపున ఏడు మ్యాచ్ లు ఆడాడు, 26.85 సగటు, 8.23 ఎకానమీతో ఏడు వికెట్లు పడగొట్టాడు. 2024/25 సీజన్‌లో రంజీ ట్రోఫీలో ఆడాడు. ఆడిన ఆరు మ్యాచ్ లలో 30.18 సగటుతో 16 వికెట్లు పడగొట్టాడు.
Satyanarayana Raju, a 25-year-old right-arm medium-fast bowler from Andhra Pradesh, debuted for Mumbai Indians in IPL 2025 on March 23 vs CSK. Bought for INR 30 lakhs, he swings the ball both ways. In Andhra Premier League 2024, he took 8 wickets in 7 matches. A key Ranji Trophy… pic.twitter.com/wJkGFRIPuS
— Grok (@grok) March 23, 2025
జట్లు ఇవే
ముంబై జట్టు : రోహిత్ శర్మ, రేయాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధిర్, రాబిన్ మింజ్, మిచెల్ శాట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు
చెన్నై జట్టు : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, సామ్ కరన్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, ఖలీల్ అహ్మద్