/rtv/media/media_files/2025/04/01/89jCx5ugOOFb0CxuHypI.jpg)
Ashwani Kumar
వాంఖడే స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ జట్టు బోణీ కొట్టింది. కోల్కతాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 117 పరుగుల లక్ష్యాన్ని కేవలం12.5 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ రోహిత్(13) మరోసారి నిరాశపర్చగా మరో ఓపెనర్ రికెల్టన్ (62*) పరుగులతో రాణించాడు, జాక్స్ (16), సూర్య (27*) పరుగులు చేశారు. కోల్కతా బౌలర్లలో రస్సెల్ 2 వికెట్లు తీశారు.
డెత్ ఓవర్ల స్పెషలిస్ట్
ఇక అంతకుముందు బ్యాటర్లంతా విఫలమవడంతో కోల్కతా నైట్ రైడర్స్ కేవలం 16.2 ఓవర్లలోనే చాపచుట్టేసింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యల్ప స్కోరు ఇది. ముంబై కొత్త బౌలర్ అశ్వనీ కుమార్ కేకేఆర్ పతనాన్ని శాసించాడు. 23 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో స్పెషలిస్ట్. ఎడమచేతివాటం ఫాస్ట్ బౌలింగ్‌తో 3 ఓవర్లలో 24 పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆడిన తొలి డెబ్యూ మ్యాచ్ లోనే 4 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. రహానే, రింకూ, మనీశ్, రసెల్ వికెట్లను దక్కించుకున్నాడు. బుమ్రా తరహాలో మరో మాణిక్యాన్ని ముంబై ఇండియన్ప్ వెలికితీసిందని, త్వరలోనే అతడు భారత్‌కు ఆడతాడని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు.
Debut straight out of a storybook 📖
— IndianPremierLeague (@IPL) March 31, 2025
The perfect first chapter for Ashwani Kumar 👌👌
Updates ▶ https://t.co/iEwchzDRNM#TATAIPL | #MIvKKR | @mipaltan pic.twitter.com/npaynbIViX
మొహాలీలో జన్మించిన అశ్వని కుమార్
పంజాబ్ లోని మొహాలీలో జన్మించిన అశ్వని కుమార్..2024లో జరిగిన షేర్-ఎ-పంజాబ్ టీ20 టోర్నమెంట్‌లో మెరిసాడు. దీంతో ముంబై ఇండియన్స్ దృష్టిలో పడ్డాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతన్ని బెస్ ప్రైజ్ రూ. 30లక్షలకు కొనుగోలు చేసింది. 2024లో పంజాబ్ జట్టు కూడా అతన్ని కొనుగోలు చేసింది కానీ అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అశ్వని కుమార్ ఇప్పటివరకు 2 ఫస్ట్ క్లాస్, 4 లిస్ట్ ఎ, 4 టీ20లు ఆడాడు. 2022 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ తరఫున అరంగేట్రం చేసి నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. అందులో 5.85 ఎకానమీతో 3 వికెట్లు పడగొట్టాడు.
Also read : Kumar Sangakkara : 51 ఏళ్ల బ్యూటీతో 47 ఏళ్ల కుమార సంగక్కర డేటింగ్!