ఇంతకీ ధోనీ.. విఘ్నేశ్‌తో ఏం మాట్లాడాడు?.. అసలు సంగతి ఇది!

అసలు ధోనీ..  విఘ్నేశ్‌తో ఏం మాట్లాడాడడన్నది అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.  ధోనీ.. విఘ్నేశ్‌ను నీ వయసు ఎంత అని అడిగి, ప్రతిమ్యాచ్‌లోనూ ఇలాగే చక్కగా ఆడమని సూచించాడట.  విఘ్నేశ్‌ స్నేహితుడు శ్రీరాగ్‌ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది.

New Update
dhoni and vignesh

ముంబై ఇండియన్స్‌ యంగ్ స్పిన్నర్‌ విఘ్నేశ్‌ పుత్తూర్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌లో సంచలనంగా మారాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రుత్‌రాజ్‌ గైక్వాడ్‌, శివమ్‌ దూబే, దీపక్‌ హూడా లను ఔట్‌ చేసి హాట్ టాపిక్ గా మారింది. మ్యాచ్‌ అనంతరం చెన్నై ఆటగాడు ధోనీ విఘ్నేశ్‌తో మాటకలిపాడు.  ఈ నేపథ్యంలో అసలు ధోనీ..  విఘ్నేశ్‌తో ఏం మాట్లాడాడడన్నది అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.  

Also read :  TG News: రేవంత్ సర్కార్ మహిళలకు గుడ్‌న్యూస్‌.. బటన్‌తో భద్రత!

నీ వయసు ఎంత అని అడిగి

ధోనీ.. విఘ్నేశ్‌ను నీ వయసు ఎంత అని అడిగి, ప్రతిమ్యాచ్‌లోనూ ఇలాగే చక్కగా ఆడమని సూచించాడట.  విఘ్నేశ్‌ స్నేహితుడు శ్రీరాగ్‌ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. గత కొన్ని రోజులుగా విఘ్నేష్ తల్లిదండ్రులకు చాలా కష్టాలు పడుతున్నాయని శ్రీరాగ్ వెల్లడించారు. విఘ్నేశ్‌ ప్రస్తుతం కాలికట్ విశ్వవిద్యాలయంలోని పెరింతల్మన్నలోని పీటీఎం ప్రభుత్వ కళాశాల నుండి ఆంగ్లంలో ఎంఏ చదువుతున్నాడు.  విఘ్నేశ్‌  కేరళ క్రికెట్ లీగ్, తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కొంతకాలం ఆడటం తప్ప ఇంకా ఫస్ట్-క్లాస్ క్రికెట్ కూడా ఆడలేదు.  

Also read :  Sonu Sood wife : సోనూసూద్ భార్య సోనాలీకి యాక్సిడెంట్... తీవ్రగాయాలు!

Also Read :  Indigo Flight: షాకింగ్ ఘటన.. విమానాన్ని ఢీకొట్టి ఇంజిన్‌ లో పడిన పక్షి.. చివరికి ఏమైందంటే..!?

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Zaheer Khan: పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!

మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ తండ్రయ్యారు. ఆయన భార్య, నటి  సాగరిక ఘట్గే  మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మినిచ్చింది. ఇదే వీరికి తొలి సంతానం కావడం విశేషం. ఈ జంట ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. ఆ మగబిడ్డకు ఫతేసిన్హ్ ఖాన్‌ అని నామకరణం చేశారు.

New Update
zaheer-khan

zaheer-khan

టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ తండ్రయ్యారు. ఆయన భార్య, నటి  సాగరిక ఘట్గే  మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మినిచ్చింది. ఇదే వీరికి తొలి సంతానం కావడం విశేషం. ఈ జంట ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. ఆ మగబిడ్డకు ఫతేసిన్హ్ ఖాన్‌ అని నామకరణం చేసినట్లుగా తెలిపారు. ఈ జంటకు అభిమానులు. తొటి క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు  చెబుతున్నారు.  

ముంబైలో హ్యాపీగా లైఫ్ లీడ్

కాగా చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్న జహీర్, సాగరిక నవంబర్ 2017లో వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి  వీరిద్దరూ ముంబైలో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మ్యారేజ్ అయిన ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. కాగా ప్రస్తుతం ఐపీఎల్ లో జహీర్ ఖాన్ బిజీగా ఉన్నాడు.  లక్నో సూపర్ జెయింట్స్‌గా మెంటార్‌గా ఉన్నాడు.

ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచుల్లో 4 విజయాలతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో ప్రస్తుతం 5వ స్థానంలో కొనసాగుతోంది లక్నో టీమ్. మహారాష్ట్రకు చెందిన 46 ఏళ్ల జహీర్‌ ఖాన్‌.. లెఫ్టార్మ్‌ మీడియం పేసర్‌. 2000 సంవత్సరంలో  అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తన 14 ఏళ్ల కెరీర్‌లో 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.  టెస్టుల్లో 311, వన్డేల్లో 282, టీ20లలో 17 వికెట్లు తీశాడు.  

Also Read :   ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్.. హైదరాబాదీనే సూత్రధారి.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

Advertisment
Advertisment
Advertisment