Cricket: క్రికెట్‌కు గుడ్‌ బై.. ధోనీ ఫ్రెండ్‌ షాకింగ్‌ డెసిషన్!

వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. గాయం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

New Update
brawo

Bravo: వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో భారత క్రికెట్‌ అభిమానులకు సుపరిచితుడే. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరుఫున ఐపీఎల్‌ లోబ్రావో ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్నట్లు బ్రావో ప్రకటించాడు. కరీబియన్‌ ప్రీమియర్‌ లీడ్‌ సందర్భంగా గాయానికి గురి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 

వచ్చే నెలలో 41 వ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్న బ్రావో 2021 లోనే ఇంటర్నేషనల్‌ క్రికెట్‌  వదిలిపెట్టేశాడు. అప్పటి నుంచి కూడా లీగుల్లో మాత్రమే ఆడుతూ వస్తున్న బ్రావో ఇక పై క్రికెటర్‌ గా ఉండబోడు. ఇప్పటికే సీఎస్కే, ఆఫ్గానిస్తాన్‌ జట్లకు బ్రావో కోచ్ గా ఉన్నాడు.

ఇక నుంచి కోచింగ్‌ కెరీర్‌ పై దృష్టి పెడతానని ఓ ప్రకటనలో వెల్లడించాడు. ''నా జీవితానికి ఎంతో ఇచ్చిన క్రికెట్‌ కు వీడ్కోలు పలికే రోజు రానే వచ్చింది. ఐదేళ్ల వయసు నుంచి క్రికెట్టే శ్వాసగా బతికాను. విండీస్‌ తరఫున ఆడటం ఒక అదృష్టమైతే వివిధ దేశాల్లో లీగుల్లో పాల్గొనడం సరదాగా ఉండేది.  ప్రతీ మ్యాచ్‌ ను ఎంతగానో ఆస్వాదించా. ఇక పై కొత్త బాధ్యతల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నిస్తా. నేను కలలుగన్నట్లు అత్యుత్తమ క్రికెటర్‌ గా మారడానికి చాలా మది భాగస్వామ్యం ఉంది. వారందరికీ చెప్పేందుకు కేవలం ధన్యవాదాలు మాత్రమే సరిపోవు. నేను సాధించిన వాటన్నింటినీ వారికే అంకితం చేస్తున్నా" అని బ్రావో చెప్పుకొచ్చాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు