Kohli: ధోనీ రికార్డ్ బ్రేక్.. కోహ్లీ ఖాతాలో మరో ఘనత!

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఇండియా తరపున అత్యధిక అంతర్జాతీయ (536) మ్యాచ్‌లు ఆడిన రెండో క్రికెటర్‌గా అవతరించాడు. మూడో స్థానంలో ధోని (535), మొదటి ప్లేస్ లో సచిన్ (664) ఉన్నారు. 

author-image
By srinivas
New Update
dereseretr

Virat Kohli: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘటన సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే వన్డే, టెస్టు మ్యాచ్ ల్లో భారీ పరుగులు చేస్తూ రికార్డులు బద్దలు కొడుతున్న విరాట్.. తాజాగా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మేరకు న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టుకు ప్రాతినిథ్యం వహించిన కోహ్లీ.. ఇండియా తరపున అత్యధిక అంతర్జాతీయ (536) మ్యాచ్‌లు ఆడిన రెండో క్రికెటర్‌గా ఘనత సాధించాడు. ఇక 15 ఏళ్ల పాటు ఆడిన ధోని 2019లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకగా.. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 535 మ్యాచ్‌లు ఆడాడు. అయితే తాజాగా కోహ్లీ 536వ మ్యాచ్‌ ఆడుతున్న విరాట్.. ప్రస్తుతం అంతర్జాతీయ కెరీర్‌లో 16వ సంవత్సరంలో కొనసాగుతున్నాడు. 

ఏకైక భారత క్రికెటర్‌‌గా కోహ్లీ..

ఇదిలా ఉంటే.. భారత్ తరపున ఇప్పటి వరకు విరాట్ 295 వన్డేలు, 125 టీ20లు, 115 టెస్టులకు ప్రాతినిథ్యం వహించాడు. ఇటీవ‌లే టీ-20 ఫార్మాట్‌ నుంచి రిటైరైన సంగతి తెలిసిందే. కాగా భారత్‌ తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లలో సచిన్‌ టెండూల్కర్‌ ముందున్నాడు. 1989-2013 మధ్య ఆడిన సచిన్ మొత్తం 664 మ్యాచ్‌లు ఆడాడు. కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోనే అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ ఘనత సాధించాడు. సచిన్ తన కెరీర్‌లో ఒకే ఒక్క టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడటం విశేషం. కగా 2008లో శ్రీలంకలో వన్డే ఫార్మాట్‌తో అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన కోహ్లి మూడు ఫార్మాట్లలో కలిపి 100కు పైగా మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఘనత సాధించిన తొలి, ఏకైక భారత క్రికెటర్‌‌గా కోహ్లీ నిలిచాడు. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటివరకు కేవలం నలుగురు క్రికెటర్లు మాత్రమే మూడు ఫార్మాట్లలో 100 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు