/rtv/media/media_files/2026/06/11/fotojet-3-2026-06-11-10-12-51.jpg)
ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ నేటి నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈసారి టోర్నమెంట్ కోసం భారీ ప్రైజ్ మనీని కేటాయించింది. ఫిఫా వరల్డ్ కప్ 2026 విజేత జట్టుకు ఏకంగా 48 మిలియన్ డాలర్లు బహుమతిగా ఇవ్వనున్నారు. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.416 కోట్లు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన జట్టుకు ఇంత భారీ మొత్తం అందించడం ఇదే తొలిసారి. దీంతో ఈసారి టైటిల్ కోసం పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.
The 2026 World Cup is about to make football history with mind-blowing money 🤯💰
— Oma Bekee (@BekeeOzzy) June 11, 2026
FIFA is distributing a massive $871 million to the 48 participating teams, the richest World Cup ever!
Out of this, $655+ million goes straight as prize money.
The champions will pocket a record… pic.twitter.com/wNwO3Iwjv0
మూడు దేశాలు కలిపి..
2026 వరల్డ్ కప్‌ను అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఇదే తొలిసారి మూడు దేశాలు కలిసి ఫిఫా వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. అలాగే గత టోర్నమెంట్లలో 32 జట్లు పాల్గొనగా ఈసారి 48 జట్లు బరిలోకి దిగనున్నాయి. ఫిఫా కొత్త ఫార్మాట్ ప్రకారం మొత్తం 104 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. గతంలో 64 మ్యాచ్‌లు మాత్రమే ఉండేవి. జట్ల సంఖ్య పెరగడంతో పాటు మ్యాచ్‌ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. అలాగే ఎక్కువ దేశాలకు వరల్డ్ కప్‌లో పాల్గొనే అవకాశం దక్కనుంది.
కేవలం విజేత జట్టుకే కాకుండా టోర్నమెంట్‌లో పాల్గొనే ప్రతి జట్టుకు కూడా ఆర్థిక లాభాలు కలగనున్నాయి. గ్రూప్ దశలోనే నిష్క్రమించిన జట్లకు కూడా ప్రైజ్ మనీ అందించనున్నారు. నాకౌట్ దశకు చేరుకున్న కొద్దీ బహుమతి మొత్తం పెరుగుతుంది. ఫైనల్‌కు చేరిన జట్లు, సెమీఫైనలిస్టులు, క్వార్టర్ ఫైనలిస్టులు అందరూ భారీ మొత్తంలో నగదు బహుమతులు పొందనున్నారు. 2022లో ఖతార్‌లో జరిగిన వరల్డ్ కప్‌లో అర్జెంటీనా విజేతగా నిలిచింది. ఆ టోర్నమెంట్‌లో కూడా భారీ ప్రైజ్ మనీ ప్రకటించినప్పటికీ, 2026లో ప్రకటించిన మొత్తం దానికంటే చాలా ఎక్కువ. దీంతో ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక ప్రైజ్ మనీ కలిగిన టోర్నమెంట్‌గా 2026 ఎడిషన్ నిలవనుంది.
Follow Us