/rtv/media/media_files/2026/06/08/india-2026-06-08-15-38-45.jpg)
ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. 300 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. మూడో రోజు ఆటలో ఆఫ్ఘనిస్తాన్‌ను రెండుసార్లు ఆలౌట్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 564/8 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి మొదటి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌట్ అయింది. ఫాలోఆన్ ఆడిన ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమై కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లలో 33 పరుగులకు 6 వికెట్లు పడగొట్టిన అరంగేట్ర ఆటగాడు మానవ్ సుతార్ భారత్ తరఫున అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్ట్ క్రికెట్‌లోనే భారత్‌కు ఇది అతి పెద్ద విజయం కావడం విశేషం.
టెస్టుల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు అత్యల్ప స్కోర్లు
103 vs IND, బెంగళూరు, 2018
109 vs IND, బెంగళూరు, 2018
112 vs IND, ముల్లన్‌పూర్, 2026*
115 vs BAN, మీర్‌పూర్, 2023
120 vs WI, లక్నో, 2019
భారత్‌కు అతిపెద్ద ఇన్నింగ్స్ విజయాలు
ఇన్నింగ్స్ & 300 పరుగులు vs AFG, ముల్లన్‌పూర్, 2026*
ఇన్నింగ్స్ & 272 పరుగులు vs WI, రాజ్‌కోట్, 2018
ఇన్నింగ్స్ & 262 పరుగులు vs AFG, బెంగళూరు, 2018
ఇన్నింగ్స్ & 239 పరుగులు vs BAN, మీర్‌పూర్, 2007
ఇన్నింగ్స్ & 239 పరుగులు vs SL, నాగ్‌పూర్, 2017
Follow Us