/rtv/media/media_files/2026/02/15/kisahn-2026-02-15-20-17-38.jpg)
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో పాకిస్థా్న్ తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇరగదీశాడు. ఇషాన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి పలు పాత రికార్డులను తిరగరాశాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, పవర్ ప్లే (మొదటి 6 ఓవర్లు) ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. ఇందులో ఇషాన్ కిషన్ ఒక్కడే 42 పరుగులు చేయడం విశేషం.
దీంతో భారత్-పాక్ టీ20 చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఇషాన్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు శుభ్‌మన్ గిల్ (35 పరుగులు - ఆసియా కప్ 2025లో ) పేరిట ఉండగా, ఇషాన్ దానిని అధిగమించాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ పరుగులేమీ చేయకుండానే అవుటైనప్పటికీ, ఇషాన్ ఒత్తిడిని చిత్తు చేస్తూ విరుచుకుపడ్డాడు.
ఇషాన్ కిషన్ కేవలం 27 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. ఇది భారత్-పాక్ టీ20ల్లో మూడో వేగవంతమైన హాఫ్ సెంచరీ. (మొహమ్మద్ హఫీజ్ - 23 బంతులు, అభిషేక్ శర్మ - 24 బంతులు మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు). మొత్తం మీద 40 బంతులు ఎదుర్కొన్న ఇషాన్.. 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేసి అవుటయ్యాడు.
ఈ క్రమంలో 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో గౌతమ్ గంభీర్ చేసిన 75 పరుగుల రికార్డును ఇషాన్ దాటేశాడు. భారత్-పాక్ టీ20 పోరులో అత్యధిక స్కోరు చేసిన మూడో భారతీయ బ్యాటర్‌గా ఇషాన్ నిలిచాడు (విరాట్ కోహ్లీ 82*, 78 తర్వాత ఇషాన్ 77).
Follow Us