/rtv/media/media_files/2025/03/19/FRiZmA1ZbotaP7IQVDWz.jpg)
ఐపీఎల్ 2025కి ముందు ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్ తగిలింది. ముంబై తొలి మ్యాచ్ కు కెప్టెన్ హార్దిక్ పాండ్య దూరం కానున్నాడు. ఓవర్ రేట్ తప్పిదం కారణంగా పాండ్యా ఒక మ్యాచ్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. దీంతో స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది యాజమాన్యం. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్ ఆడనుంది.
Also read : ఢిల్లీలో స్థానిక పిల్లలతో కలిసి క్రికెట్ ఆడిన న్యూజిలాండ్ ప్రధాని.. ఫొటోలు వైరల్
Also read : ‘ఆపరేషన్ కగార్’ వెంటనే ఆపండి.. సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఫ్రొపెసర్ డిమాండ్!
🚨 𝐇𝐚𝐫𝐝𝐢𝐤 𝐚𝐧𝐝 𝐌𝐚𝐡𝐞𝐥𝐚 𝐡𝐚𝐯𝐞 𝐚𝐫𝐫𝐢𝐯𝐞𝐝 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐏𝐫𝐞-𝐬𝐞𝐚𝐬𝐨𝐧 𝐏𝐫𝐞𝐬𝐬 𝐂𝐨𝐧𝐟𝐞𝐫𝐞𝐧𝐜𝐞 🚨
— Mumbai Indians (@mipaltan) March 19, 2025
Stay tuned for all updates here ➡️ https://t.co/hjq62ItHrf#MumbaiIndians #PlayLikeMumbai
స్లో-ఓవర్ రేటు కారణంగా
గత ఏడాది ముంబై ఇండియన్స్ గ్రూప్ దశలో నిష్క్రమించిన తర్వాత , లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో స్లో-ఓవర్ రేటు కారణంగా పాండ్య సస్పెన్షన్‌కు గురయ్యాడు. అంతేకాకుండా అతనికి 30 లక్షల మ్యాచ్ ఫీజు జరిమానా కూడా విధించబడింది. మిగిలిన ఆటగాళ్లకు వారి మ్యాచ్ ఫీజులో 50 శాతం అంటే రూ. 12 లక్షలు జరిమానా విధించబడింది.గుజరాత్ టైటాన్స్‌లో రెండు సీజన్ల పాటు జట్టును నడిపించిన పాండ్యా గతేడాది ముంబై జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. గత సీజన్ లో ముంబై జట్టు కేవలం నాలుగు మ్యాచ్‌లను మాత్రమే గెలిచి 10 పాయింట్లతో పట్టికలో అట్టడుగున నిలిచింది .
Also read : రేవంత్ సర్కార్ 40 శాతం కమిషన్ పాలన .. కేటీఆర్ సంచలన ఆరోపణలు
Also read : తెలంగాణ బడ్జెట్ .. రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్!